Akkineni heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. అక్కినేని నాగేశ్వరరావు (Nageshwara Rao) తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్ తర్వాత ఆరెంజ్ లో సక్సెస్ లను సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన వారిలో తను కూడా ఒకడు కావడం విశేషం…ఇక సీనియర్ ఎన్టీఆర్ ని, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరినీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కండ్లుగా అభివర్ణిస్తూ ఉంటారు… నాగేశ్వరరావు తర్వాత నాగార్జున అక్కినేని ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్తూన్నాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ మూడోతరం హీరోలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య, అఖిల్ మాత్రం ఆశించిన మేరకు విజయాలనైతే సాధించడం లేదు. ఇక ఇదంతా చూసిన ప్రేక్షకులు సైతం అక్కినేని ఫ్యామిలీలో ఫైర్ తగ్గిందని వాళ్ళు స్టార్ హీరోల రేంజ్ కు రాలేకపోతున్నారని మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీతో పోటీపడే కెపాసిటీ వాళ్లకు లేదని చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఎవరు ఏమనుకున్నా కూడా అక్కినేని ఫ్యామిలీలో ఉన్న హీరోలు మాత్రం ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇక నాగచైతన్య అడపదడప సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే అఖిల్ మాత్రం ఇప్పటివరకు ఒక సక్సెస్ ని కూడా సాధించలేకుండా పది సంవత్సరాలపాటు కాలం గడిపేస్తూ వస్తున్నాడు. మొత్తానికైతే వీళ్లు సరైన సక్సెస్ లను సాధించలేకపోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: కింగ్ డమ్ సినిమా విజయ్ కెరియర్ ను డిసైడ్ చేస్తుందా..?
స్టార్ డైరెక్టర్లతో సినిమాలను వర్కౌట్ చేస్తే అక్కినేని ఫ్యామిలీ హీరోలకు మంచి విజయాలైతే దక్కుతాయి. కానీ నాగార్జున అటు దిశగా ముందుకు అడుగులు వేయడం లేదు. ఇక నాగ చైతన్య, అఖిల్ సైతం వాళ్లు స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.
కానీ ఒక నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఆ లెగసిని కంటిన్యూ చేయాలంటే మాత్రం నార్మల్ సినిమాలు చేస్తే వర్కౌట్ అవ్వదు. మంచి కాన్సెప్ట్ లతో సినిమాలను చేసి ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే అది వర్కౌట్ అవుతుంది… ఇక్కడ వాళ్ళ అభిమానులు కూడా వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టగలుగుతారు.
Also Read: రవితేజ చేసిన సినిమాల్లో ఆయనకు బాగా నచ్చిన సినిమాలు ఏంటో తెలుసా..?
కాబట్టి వాళ్ళు ఎలాంటి భేషజాలకు పోకుండా కొంతమంది స్టార్ డైరెక్టర్లను గ్రిప్ లో పెట్టుకొని వాళ్ళతో సినిమాలు చేసి వరుసగా రెండు మూడు సక్సెస్ లను సాధిస్తే తప్ప వాళ్ళు స్టార్ హీరో రేంజ్ కు వెళ్లలేరు అనేది వాస్తవం…చూడాలి మరి ఇక మీదట వాళ్లు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు తద్వారా వాళ్ళకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అనేది…