Instagram Love Affair Crime: కింద ఉన్న ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు.. శరత్. ఇతడిది కర్ణాటక. చేసేది వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా.. మనోడు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉంటాడు. ఖతర్నాక్ ఫోటోలు పెడుతుంటాడు. రీల్స్ చేస్తుంటాడు. తన కష్టం గురించి చెప్పుకుంటాడు.
ఇతగాడికి అనూష అనే 20 సంవత్సరాల అమ్మాయి ఇన్ స్టా గ్రామ్ లో తగిలింది. మైకేల్ మదన కామరాజు.. ఆ అమ్మాయిని లైన్ లో పెట్టాడు. ప్రేమిస్తున్నాను చెప్పాడు. మొదట్లో ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. తర్వాత మనోడికి బెండ్ అయిపోయింది. వారిద్దరు ప్రేమలో పీకల లోతు మునిగిపోయారు. సీన్ కట్ చేస్తే బెంగళూరులో సహజీవనం మొదలుపెట్టారు.
ఒక బహుళ అంతస్తుల భవనంలో భార్యాభర్తలుగా చెప్పుకుంటూ జీవితాన్ని మొదలుపెట్టారు. గత ఆరు నెలలుగా వారిద్దరు కలిసి ఉన్నారు. అయితే ఒకరోజు అనూష చనిపోయింది.. దీనికి కారణం శరతే. ఎలాగైతే అనూషను ప్రేమించాడో.. అలాగే అనుమానం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. గత నెల 20వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశం తట్టుకోలేక అనూషను అతడు గొంతు పిసికి.. దారుణంగా హత మార్చాడు. ఆ తర్వాత తనకు తెలిసిన న్యాయవాదిని కలిశాడు. జరిగిన విషయం చెప్పాడు. ఆ న్యాయవాది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో.. ఈ దారుణం పెరుగులోకి వచ్చింది. పోలీసుల శరత్ ను అరెస్ట్ చేశారు. అనూష మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వ్యక్తిగతంగా గొడవలు జరిగాయని.. అందువల్లే తనను అంతం చేశానని శరత్ చెప్పాడు. అయితే పోలీసులు మాత్రం మరో కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అనుషను చంపడానికి శరత్ ఎందుకు తెగించాడు.. దీని వెనక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన బెంగళూరు నగరంలో కలకలం రేపింది.
