Illicit Relationship: అతడికి భార్య ఉంది. పిల్లలు కూడా ఉన్నారు. ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో రాష్ట్రాలు దాటి కర్ణాటక వచ్చాడు. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో పనికి కుదిరాడు. ఆ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. వచ్చిన డబ్బుల్లో కొంత భాగాన్ని భార్యా పిల్లలకు పంపిస్తున్నాడు. ఇంతవరకు అతడు బాగానే ఉంటే సరిపోయేది. కానీ తన ప్రవర్తన వేరే విధంగా ఉండటంతో ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. కటకటాల వెనుక శిక్ష అనుభవిస్తున్నాడు.
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలోని చెన్నమ్మ కెరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చెత్త లారీలో గుర్తుతెలియని మహిళ మృదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాస్తవానికి స్థానికులు ఆదివారం ఆ మహిళ మృతదేహాన్ని చూశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే అక్కడికి వచ్చారు. ఆదివారం ప్రాథమిక వివరాలు సేకరించిన పోలీసులు సోమవారం మాత్రం వాయువేగంతో వివరాలు సేకరించారు. సోమవారం నాటికి ఆ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం నాటికి ఆ కేసు విషయాలు మొత్తం వెల్లడించారు. సీసీ కెమెరాలు జల్లెడ పట్టి.. అసలు విషయాలు తెలుసుకున్నారు. ఆ మహిళ మరణం వెనుక ఉన్న అసలు నిజాలను బయటపెట్టారు. పోలీసుల విచారణలో మరణించిన యువతి పేరు పుష్ప అని తేలింది. పుష్ప షంషుద్దీన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: తమ్ముడు రిలీజ్ ట్రైలర్ లో అది ఒకే…కానీ ఆ ఒక్కటి మైనస్..గమనించారా..?
షంషుద్దీన్ స్వస్థలం అస్సాం. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అస్సాంలో సరైన ఉపాధి లేకపోవడంతో భార్యను, ఇద్దరి పిల్లని వదిలేసి అతడు కర్ణాటక రాష్ట్రం వచ్చాడు. ఇక్కడ బెంగళూరు నగర పరిధిలోని హులిమావు ప్రాంతంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఇక్కడ పుష్ప పరిచయం కావడంతో ఆమెతో సహజీవనం కొనసాగిస్తున్నాడు. గడచిన ఆరు నెలలుగా వారిద్దరు ఒకే చోట ఉంటున్నారు. అయితే పుష్పకు మద్యం అలవాటు ఉంది. మద్యం తాగడంతో పాటు ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో అతడికి పుష్పకు గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే గడచిన నెల 28న రాత్రి ఇద్దరి మధ్య ఫోన్లకు సంబంధించిన వ్యవహారంలో గొడవ మొదలైంది. ఆ గొడవ పెద్దది కావడంతో షంషుద్దీన్ ఆగ్రహం తట్టుకోలేక ఆమె గొంతు పట్టుకొని పిసికి అంతం చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పాలిథిన్ సంచిలో గట్టి చెత్త తరలించే వాహనంలో వేశాడు. అయితే చెత్త వేయడానికి వచ్చిన ఓ వ్యక్తికి మృతురాలి తల కనిపించిన నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందించాడు..
పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సీసీ కెమెరాలను పరిశీలించి అందులో ఉన్న వివరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణ ప్రక్రియ ముగిసిన అనంతరం అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.