Kaushal Comments On Nagarjuna Hosting: తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో విజయవంతంగా 8 సీజన్స్ ని పూర్తి చేసుకుని ఈ ఏడాదితో 9వ సీజన్(Bigg Boss 9 Telugu) ని ప్రారంభించుకోబోతుంది. ఈ 9వ సీజన్ ని కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తుంది బిగ్ బాస్ టీం. అయితే ఈ సీజన్ కి హోస్ట్ గా అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఉండదని, ఆయన స్థానం లోకి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) లేదా నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వస్తాడని, ఇలా పలు రకాలుగా సోషల్ మీడియా లో చర్చ నడిచింది. కానీ నాగార్జున నే ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తాడని రీసెంట్ గానే తేలింది. రెండు సరికొత్త ప్రోమోలను కూడా విడుదల చేసేసారు. ఆగష్టు చివర్లో కానీ , సెప్టెంబర్ మొదటి వారం లో కూడా ఈ సీజన్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే నాగార్జున హోస్టింగ్ పై బిగ్ బాస్ రెండవ సీజన్ విన్నర్ కౌశల్(Kaushal Manda) మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారాయి.
ఒక యాంకర్ కౌశల్ ని ప్రశ్న అడుగుతూ ‘త్వరలోనే బిగ్ బాస్ సరికొత్త సీజన్ ప్రారంభం కాబోతుంది. హోస్ట్ మారితే బాగుంటుందా?, లేదా ఇప్పుడు ఉన్న వ్యక్తే కొనసాగితే బాగుంటుందా?..చాలా మంది దీని గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏమిటి సార్?’ అని అడిగిన ప్రశ్నకు కౌశల్ సమాధానం చెప్తూ ‘వాస్తవానికి బిగ్ బాస్ లో ఒకే కంటెస్టెంట్ అన్ని సీజన్స్ లో కనిపిస్తే ఎంత బోరింగ్ గా ఉంటుందో, ఒకే హోస్ట్ అన్ని సీజన్స్ లో కనిపిస్తే అంతే బోరింగ్ గా ఉంటుంది. నాగార్జున గారిని మనం ఆరు సీజన్స్ నుండి చూస్తూ వస్తున్నాం. రాబోయే సీజన్ లో ఆయన కొత్త విధంగా యాంకరింగ్ చేస్తే బాగానే ఉంతుంది కానీ, కొత్త హోస్ట్ వస్తే ఈ సీజన్ పీక్ లెవెల్ కి వెళ్తుందని నా అభిప్రాయం’ అంటూ చెప్పుకొచ్చాడు.
కౌశల్ మాట్లాడిన ఈ మాటలపై అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. రెండవ సీజన్ లో కౌశల్ మేనియా ఏ రేంజ్ లో నడిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన కంటెస్టెంట్ ని మనం చూసి ఉండము. భవిష్యత్తులో కూడా చూడలేం ఏమో, బిగ్ బాస్ లో అలాంటి హిస్టరీ ని క్రియేట్ చేసాడు కౌశల్. బయటకు వెళ్లిన తర్వాత అతని కెరీర్ వేరే లెవెల్ లో ఉంటుందని అంతా అనుకున్నారు కానీ, ఎలాంటి మార్పు లేదు. బిగ్ బాస్ కి ముందు ఎలా ఉండేవాడో, బిగ్ బాస్ తర్వాత కూడా అలాగే ఉండేవాడు. రీసెంట్ గానే ఆయన మంచు విష్ణు హీరో గా నటించిన ‘కన్నప్ప’ లో ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
