Tammudu Release Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు చాలామంది దర్శకులు చేస్తున్న సినిమాలు కొత్త కథలతో రావడమే కాకుండా ప్రేక్షకులను మెప్పిస్తూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వంలో వస్తున్న తమ్ముడు (Thammudu) సినిమా ఈనెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్ ని గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు…ఈ ట్రైలర్లో అక్క తమ్ముళ్ల మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ని స్ట్రాంగ్ గా చూపిస్తూనే తమ్ముడి విషయంలో అక్క డీప్ గా హర్ట్ అయిన విషయాన్ని కూడా ఎలివేట్ చేశారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎందుకు డిస్టెన్స్ పెరిగింది. వాళ్ళ అక్కని చంపిన వాళ్లను అలాగే తన అక్క తీసుకున్న ఆశయాన్ని నితిన్ ముందుకు దూసుకెళ్లే క్యారెక్టర్ లో నటించినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీలో నితిన్ క్యారెక్టర్ కి చాలా కాన్ఫ్లిక్ట్స్ అయితే ఎదురవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. తను ట్రైబల్ ఏరియాలో ఉన్న ప్రజలను కాపాడుతూ తన అక్క మాట నిలబెట్టడం కోసం చివరి వరకు పోరాడే తమ్ముడిగా ఆయన ఈ సినిమాలో ఒక క్లియర్ కట్ పెర్ఫార్మన్స్ అయితే ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు…
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి..ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వనున్న టీం?
ట్రైలర్ చివర్లో తను నన్ను అక్కగా ఒప్పుకున్న తమ్ముడుగా నేను ఒప్పుకోను అని అంటే ఇంకా తను నెరవేర్చాల్సిన ఆశయం ఇంకా నెరవేరక ముందే తనకు కొన్ని ఇబ్బందులైతే ఎదురైనట్టుగా తెలుస్తున్నాయి. అసలు ఎవరు అతని ఇబ్బందుల్లోకి నెట్టారు. వాళ్ళ అక్కను చంపేసిన వాళ్ళు ఎవరు అనే పాయింట్ ను హైలెట్ చేస్తూ ఈ కథ ముందుకు సాగబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక సినిమా విజువల్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైబల్ ఏరియా నుంచి వచ్చే షాట్స్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది…ఈ ట్రైలర్ కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో నితిన్ ఎక్స్ట్రాడినరీగా నటించినట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే ఈ సినిమాతో అతనికి ఒక మంచి సక్సెస్ అయితే దక్క బోతుంది అనే విషయం చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది…అయితే కథ లో పెద్దగా వైవిధ్యం అయితే ఏమి లేదు…దర్శకుడు ఎమోషన్ ను ప్రపర్ గా వర్కౌట్ చేస్తే సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్తుంది లేకపోతే ఢీలా పడిపోయే అవకాశం అయితే ఉంది…
