https://oktelugu.com/

Crime news  : ఏపీలో మరో దారుణం.. సమాజం ఎటుపోతోంది? ఇంకెన్నీ చూడాలి ఇలాంటివి?

ఏపీలో నేర సంస్కృతి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజు ఏదో ఒక చోట నేరం వెలుగు చూస్తూనే ఉంది. ముఖ్యంగా మహిళలపై దాడులు, అకృత్యాలు ఆగడం లేదు.

Written By:
  • Dharma
  • , Updated On : August 18, 2024 11:32 am
    Crime News

    Crime News

    Follow us on

    Crime news : సమాజంలో మనిషి మాయమవుతున్నాడు. జంతువును జంతువు వేటాడే ఆటవిక రాజ్యంగా సమాజం మారుతోంది. స్నేహం చేసిన పాపానికి.. స్నేహితుడి భార్యని చెరిచారు ముగ్గురు యువకులు. భర్త ఎదుటే ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన ఏలూరులో వెలుగు చూసింది. మూడు పోలీస్ స్టేషన్లకు కూత వేటు దూరంలో ఈ దారుణం జరిగింది. 15 రోజుల క్రితమే నగరానికి చేరుకున్న ఆ దంపతులు పగలంతా హోటల్లో పనిచేసి.. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే స్టేజీపై పడుకునేవారు. ఇల్లు అద్దెకు దొరికే వరకు అక్కడే గడుపుతున్నారు. ఇంతలో నగరానికి చెందిన ముగ్గురు యువకులు వారికి పరిచయమయ్యారు. వారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జులాయిగా తిరిగేవారు. ఈ క్రమంలో ఆ ముగ్గురు వీరికి పరిచయం అయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఆ ముగ్గురు యువకులతో భర్త మద్యం తాగాడు. ఆ సమయంలో భార్య పక్కనే నిద్రిస్తోంది. ఈ క్రమంలో ఆ ముగ్గురు యువకులు భర్తను దారుణంగా కొట్టారు. నిద్రిస్తున్న మహిళను పక్కకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం ఆమె ముఖం పై దాడి చేశారు. భర్త రోడ్డుపై కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు.అయితే 100కు ఫోన్ చేసినా స్పందన లేనట్లు తెలుస్తోంది. దీంతో సదరు యువకుడు సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి చెప్పడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

    * 15 రోజుల కిందటే నగరానికి
    పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయి కి చెందిన ఆ దంపతులు 15 రోజుల కిందట నగరానికి వచ్చారు. వన్ టౌన్ రామకోటి ప్రాంతంలో ఉంటున్నారు. పగలు హోటల్లో పనిచేస్తుంటారు. రాత్రిళ్ళు రామకోటిలో సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించే స్టేజీ అరుగులపై విశ్రమిస్తుంటారు. ఇల్లు అద్దెకు దొరికిన తరువాత వెళ్ళిపోతామని భావించారు. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా సంచలనం రేకెత్తించింది. మద్యం మత్తులోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

    * పోలీసుల సీరియస్ యాక్షన్
    ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చెంచుల కాలనీకి చెందిన నూతిపల్లి పవన్, లంబాడి పేటకు చెందిన నారపాటి నాగేంద్ర, మరడాని రంగారావు కాలనీకి చెందిన గడ్డి విజయ్ కుమార్ అలియాస్ నానీలను అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.

    * తగ్గని నేరాలు
    ఏపీలో ఇటువంటి ఘటనలు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా సమాజంలో నేరాలు తగ్గుముఖం పట్టడం లేదు. పోలీసులు కట్టిన చర్యలకు ఉపక్రమిస్తున్నా నేరాలకు పాల్పడే వారిలో మాత్రం మార్పు రావడం లేదు.