Hindu Auto Driver: మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో మైనారిటీలు అయిన హిందువులపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. మహ్మద్ యూనస్ ప్రభుత్వం మైనారిటీలకు రక్షణ కల్పించడంలో విఫలమైంది. బంగ్లాదేశ్ యువ నేత, రాజకీయ కార్యకర్త ఉస్మాన్ హాదీ హత్య తర్వాత ఆ దేశంలో అల్లరు‍్ల కొనసాగుతున్నాయి. ఎన్నికల వేల అల్లర్ల ద్వారా భారత్‌పై విద్వేషం పెంచాలని యూనస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే హిందువులను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే పది మందికిపైగా హిందువులను హత్య చేశారు. తాజాగా ఫెని జిల్లా దగన్‌భూయాన్ ప్రాంతంలో 29 ఏళ్ల సమీర్ కుమార్ దాస్‌ను కొట్టి చంపారు. స్థానిక ఆటో డ్రైవర్‌గా పనిచేసిన అతని మృతదేహం ఆసుపత్రి సమీపంలో రక్తపు మడుగులో గుర్తించారు.
ఆటో కొట్టుకున్నారు
దుండగులు సమీర్‌ను దారుణంగా కొట్టి చంపిన తర్వాత మృతదేహాన్ని అతని ఆటోను తీసుకెళ్లారు. ఫోన్, బంగారు చైన్, నగదు, విలువైన వస్తువులు దోచుకోలేదు. దీంతో పోలీసులు ఇది దోపిడీ కాకుండా, మతపరమైన లేదా రాజకీయ ప్రేరేపిత హత్యగా భావిస్తున్నారు. స్థానికులు ఈ దాడిని చూశారని, కానీ భయంతో మౌనం ఉంటున్నారని సమాచారం.
హిందువులపై దాడులు తీవ్రం
ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై దాడులు, ఆస్తి ధ్వంసాలు, హత్యలు పెరిగాయి. మతపరమైన ఉద్రిక్తతలు, రాజకీయ కుట్రల వల్ల ఇటువంటి ఘటనలు సంభవిస్తున్నాయని నివేదికలు తెలియజేస్తున్నాయి. భారతదేశంలోని హిందూ సంఘాలు ఈ హత్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని రక్షణ కల్పించమని డిమాండ్ చేస్తున్నాయి.
షేక్ హసీనా తర్వాత..
ఆరీ‍్మ ఉద్యోగుల పిల్లలకు రిజర్వేషన‍్ల కల్పనపై మొదట అల్లర్లు చెలరేగాయి. దీంతో షేక్‌హసీన పదవికి రాజీనామా చేయడంతోపాటు దేశం విడిచి పారిపోయారు. ఆ సమయంలో కూడా హిందువులపై పెద‍్ద ఎత్తున దాడులు జరిగాయి. వందమందికిపైగా హత్యకు గురయ్యారు. తాజాగా మళ్లీ అలాంటి పరిస్థితే వచ్చు అవకాశం కనిపిస్తోంది.