Mana Shankara Varaprasad Garu 2nd Day Collections: ‘ఐ బొమ్మ’ రవి అరెస్ట్ అవ్వడం తో టాలీవుడ్ లో పైరసీ మాఫియా కి దాదాపుగా చరమగీతం పాడినట్టే, ఇక తెలుగు సినిమాకు మంచి రోజులు మొదలయ్యాయి అని సినీ ఇండస్ట్రీ మొత్తం సంబరాలు చేసుకుంది. కానీ పైరసీ భూతం పది తలల రావణాసురిడిలాగా మన టాలీవుడ్ ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. నిన్న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం నేడు HD ప్రింట్ తో పైరసీ అయ్యి ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ అంశం పై మెగా అభిమానులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఈ మహమ్మారి ని అరికట్టలేకపోతున్నందుకు నిస్సహాయత వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా లో మూవీ టీం కి పైరసీ లింక్స్ ని పంపి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
పాజిటివ్ టాక్ తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం మొదటి రోజే 84 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. రెండవ రోజు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 23 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. పండగ కి ముందు ఈ రేంజ్ ర్యాంపేజ్ వేస్తున్న ఈ చిత్రం, పండగ సెలవుల్లో ఏ రేంజ్ వసూళ్లను రాబట్టగలదో మీరే ఊహించుకోండి. అలాంటి సినిమాకు పైరసీ భూతం కారణంగా నష్టాలు జరిగితే ఎలా ఉంటుంది?, ఇంత మంది సినీ పెద్దలు ఉన్నారు , ఈ పైరసీ ని మాత్రం అరికట్టలేకపోతున్నారు, ఇలా అయితే సినిమా ఎలా బ్రతుకుతుంది?, ఒకప్పుడు నెలల తరబడి థియేటర్స్ లో రన్ అయ్యే సినిమాలు , ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని వారానికే సర్దేస్తున్నాయి, ఇలాంటి సమయం లో పైరసీ కూడా తోడు అవ్వడం చూస్తుంటే సినీ ఇండస్ట్రీ భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు, ప్రభాస్ రాజా సాబ్ చిత్రం కూడా విడుదల రోజే పైరసీ ద్వారా అందుబాటులోకి వచ్చేసింది. 500 కోట్లు పెట్టి తీసిన సినిమా, పైగా ఫ్లాప్ టాక్, ఎవరు థియేటర్ కి వెళ్లి చూస్తారు చెప్పండి. అసలే నష్టాల్లో ఉన్న సినిమా, ఇలాంటి పైరసీ కారణంగా ఇంకా ఎక్కువ నష్టాలను చూడాల్సి వస్తుంది. ఇక సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా , కేవలం హిట్ రేంజ్ వద్దకు ఆగిపోతుంది. సంక్రాంతికి ‘మన శనకర వరప్రసాద్ గారు’ కి టికెట్స్ దొరకడం కష్టమే. అలాంటి సమయం లో ప్రేక్షకులు పైరసీ లో చూసే అవకాశం ఉంటుంది కదా?, మూవీ టీం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుందో చూడాలి.