Ghaziabad: ఆ బాలుడు పేరు రాజు 1993 సెప్టెంబర్ 8న పాఠశాలకు వెళుతుండగా దుండగులు అతని అపహరించారు. అతడు స్కూలుకు వెళ్లే ఘజియాబాద్ ప్రాంతం నుంచి చాలా దూరం తీసుకెళ్లారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో అతడిని బంధించారు. ఆ తర్వాత రోజు కొడుతుండేవారు. రాత్రిపూట కూడా హింసిస్తూ ఉండేవారు.. ఆ తర్వాత అతడు వారి నుంచి తప్పించుకున్నాడు. ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీలో ఒకచోట పనికి కుదిరాడు. అలా పని చేసుకుంటూ జీవించడం మొదలుపెట్టాడు. తన పేరు రాజ్ సింగ్ గా మార్చుకున్నాడు. స్థానికంగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. కొంతకాలం అలా పని చేశాడు. జీవితం ఒంటరిగా అనిపించడం.. నా అనే వాళ్లు లేకపోతే జీవితం లేదని భావన కలగడంతో.. తన వాళ్లను వెతుక్కుంటూ వచ్చాడు..
ఈలోగా తన నేపథ్యాన్ని ఖోడా పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత అతడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు విచారణ సాగించారు. చివరికి అతడు ఘజియాబాద్ ప్రాంతానికి చెందిన దంపతులకు కుమారుడని నిర్ధారించారు. ఆ తర్వాత అతడిని వారికి అప్పగించారు. 30 సంవత్సరాల తర్వాత అపహరణకు గురై.. ఇన్నాళ్లకు ఇంటికి రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ కుమారుడు ఇక లేడని.. దుండగులచేతిలో చనిపోయి ఉంటాడని వారు భావించారట. అందువల్లే ప్రతి ఏడాది అతడి చిత్రపటానికి తిథి కార్యాలు నిర్వహిస్తున్నారట. అయితే ఇన్నాళ్లకు తమకుమరుడు తిరిగి రావడంతో వారు నమ్మలేకపోతున్నారు. తమ కుమారుడిని ఇంటిదాకా తీసుకువచ్చిన పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ” నమ్మలేకపోతున్నాం. మా కుమారుడు బతికి ఉన్నాడంటే ఆశ్చర్యపోతున్నాం. చిన్నప్పుడు కిడ్నాప్ అయ్యాడు. చనిపోయాడని నిర్ధారణకు వచ్చాం. కానీ ఇన్నాళ్లకు బతికి మా ముందుకు వచ్చాడు. మా కుమారుడిని చూస్తే గర్భంగా ఉందని” ఆ తల్లిదండ్రులు చెబుతున్నారు. తనను కిడ్నాప్ చేసిన ముఠా గురించి పోలీసులకు రాజు చెప్పాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా ఖోడా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇస్తాను పోలీసులకు సమాచారం అందించి.. వారి ఆట కట్టించే పనిలో పడ్డారు. పాత నేర రికార్డులను పరిశీలిస్తున్నారు. తగిన ఆధారాలతో వారిని చట్టం ముందు దోషులుగా నిలబెడతామని పోలీసులు చెబుతున్నారు. పిల్లలను అపహరించే దుండగుల ఆగడాలను అరికడతామని వివరిస్తున్నారు. చిన్నారులను అపహరించే దుండగుల ఆట కట్టించేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేస్తామని.. విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Ghaziabad kidnapping 30 years ago do you know what happened after that
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com