Delhi : ఫ్లాట్ కొనుగోలు విషయంలో వ్యాపారితో వివాదం.. సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసి మాజీ కానిస్టేబుల్ ఎంతటి ఘాతుకానికి పాల్పడ్డాడంటే..

 సినిమాలు, వెబ్ సిరీస్ లు మనుషుల మీద ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయో నిరూపించే ఘటన ఇది. వాటిలో చూపించిన నేరమయ దృశ్యాలను చూసిన ఓ మాజీ కానిస్టేబుల్ దారుణానికి పాల్పడ్డాడు. ఇది దేశ రాజధాని ఢిల్లీలో సంచలనాన్ని సృష్టించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 25, 2024 8:54 am

Delhi Murder case

Follow us on

Delhi : ఢిల్లీ మహానగరంలోని గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన అంకుష్ శర్మ అనే వ్యాపారవేత్తకు నోయిడా సొసైటీలో ఒక ఫ్లాట్ ఉంది. చాలా సంవత్సరాల నుంచి దానిని అమ్మాలని అతడు భావిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు. దాన్ని చూసిన ఒక మాజీ కానిస్టేబుల్ ప్రవీణ్ అంకుష్ శర్మ ను ఫోన్లో సంప్రదించాడు. ఆ తర్వాత వారిద్దరూ పలు సందర్భాల్లో కలుసుకున్నారు. ఫ్లాట్ కొనుగోలుపై చర్చించారు. చివరికి 1.20 కోట్లకు ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ప్రవీణ్ ముందుకు వచ్చాడు. ఎనిమిది లక్షలు అడ్వాన్స్ గా చెల్లించాడు. ఇది క్రమంలో అంకుష్ శర్మ ప్లేట్ ఫిరాయించాడు. బయటి మార్కెట్లో ధర ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాను ఆ ధరకు ఇవ్వలేనని చెప్పాడు. దీంతో ప్రవీణ్, అంకుష్ శర్మ మధ్య వివాదం మొదలైంది. పలుమార్లు మధ్యవర్తుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. అయినప్పటికీ అంకుష్ శర్మ ఫ్లాట్ ఆ ధరకు విక్రయించలేనని స్పష్టం చేశాడు. దీంతో ప్రవీణ్ కు కోపం తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో అతడు సినిమాలు, వెబ్ సిరీస్ లలో చూసిన దృశ్యాలతో స్ఫూర్తి పొంది.. సరికొత్త ప్రణాళికను రూపొందించాడు.

బయటి మార్కెట్ ధరకే డబ్బులు ఇస్తానని చెప్పి అంకుష్ శర్మకు ప్రవీణ్ ఫోన్ చేశాడు. ఆగస్టు 9న ఢిల్లీలోని ఓ ప్రాంతానికి రమ్మన్నాడు. ప్రవీణ్ చెప్పినట్టుగానే అంకుష్ శర్మ అక్కడికి వెళ్ళాడు. ఇద్దరు కలిసి మద్యం తాగారు. అంకుష్ కు ప్రవీణ్ విపరీతంగా మద్యం తాగించాడు. ఆ తాగిన మైకంలో అంకుష్ శర్మ తలపై ప్రవీణ్ సుత్తితో గట్టిగా కొట్టాడు. దీంతో అంకుష్ శర్మ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని అంకుష్ శర్మ ప్లాట్ లోనే పాతిపెట్టాడు. అంకుష్ శర్మ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫోన్ నెంబర్ కాల్ డాటా ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. పలు ప్రాంతాలలో సిసి పుట్టేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా ప్రవీణ్ అసలు విషయం చెప్పాడు. దీంతో అతడిని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు. కేసును విచారించిన న్యాయమూర్తి ప్రవీణ్ కు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు.. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ , సినిమాలలో దృశ్యాలను ప్రేరణగా తీసుకొని తాను ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రవీణ్ న్యాయమూర్తి ఎదుట అంగీకరించాడు. దీంతో ఆశ్చర్యపోవడం న్యాయమూర్తి వంతయింది.