https://oktelugu.com/

AP Election Survey 2024: ఏపీలో బిగ్ టివి సర్వే సంచలనం.. గెలుపు ఆ పార్టీదే

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నసంగతి తెలిసిందే. వైసిపి ఒంటరి పోరాటం చేస్తుండగా.. టిడిపి, జనసేన, బిజెపి కూటమి కట్టి పోటీలోకి దిగాయి. పొత్తులో భాగంగా టిడిపి 144, జనసేన 21, బిజెపి 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

Written By: Dharma, Updated On : May 7, 2024 10:47 am
AP Election Survey 2024

AP Election Survey 2024

Follow us on

AP Election Survey 2024: ఎన్నికలు దగ్గర పడుతున్న కొలదీ సర్వేలు పుట్టుకొస్తున్నాయి. ప్రజాభిప్రాయం ఇది అంటూ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా బిగ్ టీవీ సర్వే బయటకు వచ్చింది. ఏపీలో అధికారంలోకి రాబోయేది ఎవరన్నది తేల్చేసింది. గతంలో కర్ణాటక, తెలంగాణలో బిగ్ టీవీ సర్వే సక్సెస్ అయ్యింది. వాస్తవ ఫలితాలకు దగ్గరగా తన సర్వే రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో కూడా ఆ సంస్థ సర్వే ఫలితాలను వెల్లడించడం సర్వత్రా ఉత్కంఠ రేపింది.ఇప్పటికే వరుస సర్వేలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఏపీ ప్రజలు.. బిగ్ టీవీ సర్వేను సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నసంగతి తెలిసిందే. వైసిపి ఒంటరి పోరాటం చేస్తుండగా.. టిడిపి, జనసేన, బిజెపి కూటమి కట్టి పోటీలోకి దిగాయి. పొత్తులో భాగంగా టిడిపి 144, జనసేన 21, బిజెపి 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బిగ్ టీవీ ఆసక్తికర ఫలితాలను వెల్లడించింది. టిడిపి కూటమిదే అధికారం అని తేల్చి చెప్పింది. కూటమికి 116 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. వైసిపి కేవలం 59 స్థానాలకు పరిమితం అవుతుందని తేల్చి చెప్పింది ఈ సర్వే. తెలుగుదేశం పార్టీకి 69 స్థానాలు క్లియర్ మెజారిటీ ఉందని.. మరో 20 చోట్ల టైట్ ఫైట్ ఉన్నా టిడిపికే ఛాన్స్ ఉందని తేల్చి చెప్పింది. జనసేన ఎనిమిది స్థానాలను గెలుస్తుందని.. మరో ఎనిమిది స్థానాల్లో టైట్ పొజిషన్ ఉందని తేల్చింది. బిజెపి మూడు స్థానాల్లో గెలుస్తుందని.. మరోచోట ఏడ్జ్ కనిపిస్తోందని చెప్పుకొచ్చింది.

వైసీపీకి 39 స్థానాలు క్లియర్ గా ఉన్నాయని.. 20 స్థానాల్లో ఎడ్జ్ ఉందని.. ఆ పార్టీ మొత్తం 59 స్థానాల్లో గెలుపొందే ఛాన్స్ ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలడం విశేషం.శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలకు గానుటిడిపికి ఆరు స్థానాలు లభించే అవకాశం ఉంది. నాలుగు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది. విజయనగరంలో టిడిపి కూటమికి ఒకటి, వైసిపి కి మూడు, ఐదు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది. విశాఖ జిల్లాలో టిడిపి కూటమికి ఏడు, వైసీపీకి ఒకటి, ఏడు చోట్ల టఫ్ ఫైట్, ఈస్ట్ గోదావరి జిల్లాలో టిడిపికి 11, వైసీపీకి మూడు, ఐదు చోట్ల టఫ్ ఫైట్. వెస్ట్ గోదావరి జిల్లాలో టిడిపికి ఏడు, వైసిపికి మూడు, ఐదు చోట్ల టఫ్ ఫైట్. కృష్ణాజిల్లాలో టిడిపికి ఆరు, వైసీపీకి ఐదు, ఐదు చోట్ల టఫ్ ఫైట్. గుంటూరు జిల్లాలో టిడిపి కూటమికి ఏడు, వైసీపీకి ఐదు, ఐదు చోట్ల టఫ్ ఫైట్. ప్రకాశం జిల్లాలో టిడిపి కూటమికి ఆరు, వైసీపీకి ఐదు, రెండు చోట్ల టఫ్ ఫైట్. నెల్లూరు జిల్లాలో టిడిపి కూటమికి మూడు, వైసిపికి రెండు, ఐదు చోట్ల టఫ్ ఫైట్. కడప జిల్లాలో టిడిపి కూటమికి రెండు, వైసిపికి రెండు, ఆరు చోట్ల టఫ్ ఫైట్, కర్నూలు జిల్లాలో ఆరు టిడిపి కూటమి, మరో ఆరుంట వైసిపి, రెండు చోట్ల టఫ్ ఫైట్. అనంతపురం జిల్లాలో టిడిపి కూటమి ఏడు, నాలుగు వైసిపి, మూడు చోట్ల టఫ్ ఫైట్, చిత్తూరు జిల్లాలో టిడిపి కూటమి ఆరు, వైసిపి నాలుగు, నాలుగు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని బిగ్ టీవీ సర్వేలో తేలింది.