Machilipatnam: వారిద్దరి ప్రేమికులు. కొంతకాలంగా హైదరాబాదులో ఉంటున్నారు. ఒక పని నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోని రైల్లో కాకుండా.. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సీటు రిజర్వ్ చేసుకున్నారు.
సీటు రిజర్వ్ చేసుకునే క్రమంలో ఎత్తుగడ వేశారు. అమ్మాయి ప్రేమికుడు తనను కూడా యువతిగా పేర్కొన్నాడు. ఇద్దరు యువతులు అనుకుని ట్రావెల్స్ నిర్వాహకులు సీట్లు కేటాయించారు.
బస్సు ఎక్కిన తర్వాత.. ఓ సీట్లో అమ్మాయి.. మరో సీట్లో అబ్బాయి కూర్చున్నాడు. దీంతో బస్సు డ్రైవర్ కు అనుమానం కలిగింది. ఇది పద్ధతి కాదని అతడు ప్రశ్నించాడు. అంతే కాదు వారిద్దరూ పక్కపక్కనే పడుకోవడానికి అతడు ఒప్పుకోలేదు. ఫలితంగా వారిద్దరు డ్రైవర్ తో తీవ్రంగా గొడవపడ్డారు.. డ్రైవర్ పై దాడి చేయడానికి ప్రయత్నించారు.. చివరికి అన్నంత పనీ చేశారు. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ యువతి ఒత్తిడి వల్లే ఆ యువకుడు డ్రైవర్ మీద దాడి చేసినట్టు తెలుస్తోంది. బస్సు హైదరాబాదులో ప్రయాణం మొదలు పెట్టినప్పుడు డ్రైవర్ వారిద్దరి వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టాడు. అప్పుడే వారి ముగ్గురి మధ్య గొడవ జరిగింది. బస్సు మచిలీపట్నం వద్దకు రావడంతో.. ఆ యువతి బస్సు దిగి వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ.. “నన్ను నీ పక్కన కూర్చొనివ్వలేదు. అతడిని వదలొద్దు” అంటూ తన ప్రియుడిని రెచ్చగొట్టింది. దీంతో ఆ యువకుడు చచ్చిపోయాడు. మచిలీపట్నంలోని చిలకలపూడి సెంటర్లో బస్సు డ్రైవర్ పై దాడి చేశాడు. డ్రైవర్ గాయపడ్డాడు. ఆ తర్వాత అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు..