Uttar Pradesh: పెళ్లయిన 40 రోజులకే భర్తతో విడాకులు.. భార్య చెప్పిన కారణం తెలిసి షాక్ కు గురైన న్యాయవాది

పెళ్లంటే నూరేళ్లపంట. భిన్న నేపథ్యాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వివాహ బంధం ద్వారా ఒక్కటవుతారు. పిల్లల్ని కని తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు. అందువల్లే మనదేశంలో వైవాహిక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 17, 2024 8:36 am

Uttar Pradesh

Follow us on

Uttar Pradesh: ప్రస్తుత కాలంలో సరైన వయసుకు వివాహం జరగడం అరుదుగా మారింది. చదువు, కెరియర్, ఉద్యోగం, సంపాదన.. ఇన్నింటి మధ్య చాలామంది యువత సరైన వయసుకి పెళ్లి చేసుకోవడం లేదు. కెరియర్ పరంగా గోల్స్ ఎక్కువగా ఉండడంతో చాలామంది పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు. ఇక కొంతమంది పురుషులకైతే సరైన వయసులో పెళ్లి జరగడం లేదు. దీంతో పెళ్లికాని ప్రసాద్ లు గా మిగిలిపోతున్నారు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనం పూర్తి డిఫరెంట్. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా ప్రాంతానికి చెందిన వారిద్దరికీ సరైన వయసులోనే పెళ్లయింది. అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి క్రతువు జరిగింది. పెళ్లి తర్వాత అసలు కథ అప్పుడే మొదలైంది. నూతన దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలు తట్టుకోలేక ఆ ఇల్లాలు విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కింది. అయితే తనకు విడాకులు ఎందుకు కావాలో ఆ వివాహిత చెప్పిన కారణం అందర్నీ షాక్ కు గురి చేసింది.

స్నానం చేయడం లేదట

పెళ్లి జరిగిన నాటి నుంచి ఆ యువకుడు శారీరక శుభ్రత సరిగ్గా పాటించడం లేదట. సరిగ్గా స్నానం కూడా చేయలేదట. చెమట కంపుతో దుర్వాసన వస్తుండడంతో తాను అతనితో సంసారం చేయలేనని ఆ భార్య కోర్టు మెట్లు ఎక్కింది. తనకు విడాకులు ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరింది.. పెళ్లయిన 40 రోజులకే ఆమె కోర్టును ఆశ్రయించడం సంచలనం రేపింది. దీనిపై ఆ యువతి భర్తను ప్రశ్నిస్తే.. అతడు సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ” నేను నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే నా దేహాన్ని శుభ్రం చేసుకుంటాను. వారానికి ఒకసారి నా శరీరంపై గంగానది నీరు చల్లుకుంటాను. నాకు పెళ్లయిన తర్వాత ఈ 40 రోజుల్లో నా భార్య పట్టు పట్టడం వల్ల ఆరుసార్లు స్నానం చేశానని” ఆ యువకుడు చెప్పడంతో న్యాయవాది ఆశ్చర్యపోయారు. ” వివిధ సందర్భాల్లో స్నానానికి సంబంధించి భార్య నాతో తీవ్రస్థాయిలో గొడవ పడింది. తర్వాత నా భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె తరపు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో నాపై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. విడాకులు కావాలని కోరారు. పోలీసులు నాకు సర్ది చెప్పడంతో రోజు స్నానం చేసేందుకు ఒప్పుకున్నానని” ఆ వ్యక్తి న్యాయమూర్తి ఎదుట పేర్కొన్నాడు. అతడు స్నానం చేయడానికి ఒప్పుకున్నప్పటికీ ఆ యువతి అతనితో కలిసి జీవించడానికి ఒప్పుకోవడం లేదు. దీంతో మరోమారు విచారిస్తామని న్యాయవాది ప్రకటించారు. సెప్టెంబర్ 22 కు ఈ కేసును వాయిదా వేశారు.