Earthquakes: భూకంపాలను అధ్యయనం చేస్తుండగా శాస్త్రవేత్తలకు మిస్టరీ సిగ్నల్.. తర్వాత ఏమైందంటే?

భూ అంతర్భాగంలో ఏర్పడే కదలికల వల్ల భూకంపాలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో నష్టం అధికంగా ఉంటుంది. రిక్టర్ స్కేల్ పై ఏర్పడిన భూకంపం తీవ్రత ఆధారంగా నష్టం ఉంటుంది. మనదేశంలో గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఏర్పడిన భూకంపం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 17, 2024 8:32 am

Earthquakes

Follow us on

Earthquakes: భూకంపం ఎందుకు వస్తుంది? భూ అంతర్భాగంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఎలాంటి ప్రాంతాల్లో భూకంపాలు వస్తాయి? భూకంపం ముందుగా వచ్చే సంకేతాలను తెలుసుకోవచ్చా? ఒకవేళ భూకంపాన్ని ముందుగానే నివారించవచ్చా? అనే అంశాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఇలా సాగిస్తుండగా సరిగా ఏడాది క్రితం సెప్టెంబర్ 2023లో ఒక వివాదాస్పద శబ్దం వినిపించింది. ఈ శబ్దం ఆర్కిటిక్ ఖండం నుంచి అంటార్కిటికా ఖండం వరకు ఇది రికార్డు అయింది. శాస్త్రవేత్తలు ఈ తరహా శబ్దాలు గతంలో వినలేదు. దీంతో ఒక్కసారిగా వారు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు ఆ మిస్టరీ వీడింది. దానికి గ్రీన్ ల్యాండ్ ప్రాంతంలోని భారీగా మంచు పర్వతాలు విరిగి పడటం వల్ల. గత ఏడాది వినిపించిన ఆ శబ్దాలు భూకంప శబ్దాల కంటే భిన్నంగా ఉన్నాయట. నిరంతరం వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ తో అవి వినిపించాయట. దీంతో తాము గందరగోళానికి గురయ్యామని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇదే సమయంలో భూమి లోపల గుర్తుతెలియని వస్తువు ఏదైనా ప్రయాణిస్తోందా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఆ శబ్దాలపై లోతుగా పరిశోధనలు సాగించారు. చివరకు మంచు పర్వతాలు విరిగిపడటం వల్ల సునామీ ఏర్పడిందని.. ఆ సునామి అలల వల్ల శబ్దాలు వినిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. తాము చేసిన అధ్యయనాన్ని ఓ సైంటిఫిక్ జర్నల్ లో పేర్కొన్నారు.. గ్రీన్ ల్యాండ్ లోని తూర్పు ప్రాంతంలో డిక్సన్ ఫోర్ట్ అనే ఏరియాలో 4 అడుగుల ఎత్తులో మంచు పర్వతాలు ఉన్నాయి. ఈ బేస్ వద్ద ఉన్న ఒక హిమానీ నదం కొంతకాలంగా కరుగుతోంది. దీంతో ఆ మంచు ఫలకాలు పదులకొద్దీ మీటర్లలో మందాన్ని కోల్పోయాయి. పలచగా మారి విరిగిపోయాయి. దీనివల్ల సునామీ ఏర్పడింది. చాలా ఎత్తు నుంచి మంచు పర్వతాలు విరిగిపడటం వల్ల భూమి ఒకసారిగా కంపనానికి గురైంది. ఆ సునామీ వల్ల 200 మీటర్ల ఎత్తువరకు అలలు ఎగిసిపడ్డాయి. ఈ అలల ప్రభావం వల్ల ఏర్పడిన శబ్దం 9 రోజుల వరకు వినిపిస్తూనే ఉంది.

ఈ సునామి వల్ల ప్రతి 90 సెకండ్లకొసారి ఆ శబ్దాలు వినిపించాయి. అయితే ఈ పరిణామానికి గ్లోబల్ వార్మింగ్ కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే పరిస్థితి ఇలానే ఉంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఇది ఒక రకంగా మానవాళికి హెచ్చరిక లాంటిదని.. ఇప్పటికైనా మేలుకోకపోతే ఇబ్బందులు తప్పవని శాస్త్రవేత్తలు అంటున్నారు.. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాన్ని తగ్గించడమే గ్లోబల్ వార్మింగ్ ముప్పుకు అసలైన పరిష్కార మార్గమని వారు వివరిస్తున్నారు. చెట్లను నరకకుండా ఉంటే కొంతలో కొంత గ్లోబల్ వార్మింగ్ ను నివారించవచ్చని చెబుతున్నారు.