https://oktelugu.com/

Cyber Crime: జాగ్రత్త..! సైబర్ నేరగాళ్లు ఈ రకంగానూ మోసం చేయవచ్చు..

ఇటీవల ఒక వ్యక్తి ఓ మహిళకు ఫోన్ చేశాడు. తాను ఇతరులకు డబ్బు పంపించే సమయంలో పొరపాటు తన మహిళ ఖాతాలోకి వచ్చిందని చెప్పాడు. అందువల్ల ఆ డబ్బును తిరిగి పంపాలని కోరాడు. అయితే ఈ డబ్బు అత్యవసరంగా పంపించామని, అందువల్ల వెంటనే తిరిగి పంపాలని కోరాడు.

Written By: Srinivas, Updated On : May 5, 2024 2:37 pm
Cyber ​​Frauds

Cyber ​​Frauds

Follow us on

Cyber Crime:  మొబైల్ వచ్చాక టెక్నాలజీ ఊపందుకుంది. కొన్ని పనులు మొబైల్ ఉపయోగించి ఈజీగా చేసుకుంటున్నారు. అయితే మొబైల్ టెక్నాలజీ వినియోగం వల్ల ఎంత ఉపయోగం ఉందో.. అంతే ప్రమాదం కూడా ఉంది. చేతిలోమొబైల్ ఉన్న వాళ్లు నేటి కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే భారీగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. కొందరు సైబర్ నేరగాళ్లు మొబైల్ కు వివిధ రకాల లింకులు పంపించి బ్యాంకు ఖాతాదారుల డబ్బులు మాయం చేసిన సంఘటనలు ఇప్పటికే చాలా చూశాం. అయితే సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో వినియోగదారులను అయోమయానికి గురి చేస్తూ డబ్బలు కొల్లగొడుతున్నారు. తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఇటీవల ఒక వ్యక్తి ఓ మహిళకు ఫోన్ చేశాడు. తాను ఇతరులకు డబ్బు పంపించే సమయంలో పొరపాటు తన మహిళ ఖాతాలోకి వచ్చిందని చెప్పాడు. అందువల్ల ఆ డబ్బును తిరిగి పంపాలని కోరాడు. అయితే ఈ డబ్బు అత్యవసరంగా పంపించామని, అందువల్ల వెంటనే తిరిగి పంపాలని కోరాడు. దీంతో ఆ వ్యక్తి చెప్పిన విషయానికి మహిళ కరుణించి వెంటనే సదరు వ్యక్తికి డబ్బులను తిరిగి పింపించింది. అయితే ఆ వ్యక్తి రూ.3000లు పంపించగా.. అదే రూ.3000 టైప్ చేసి పంపించారు. కానీ ఆ తరువాత మహిళ ఖాతాలో నుంచి రూ. 30 వేల రూపాయలు మాయమయ్యాయి.

ఈ విషయం తెలుసుకున్న మహిళ షాక్ కు గురైంది. వెంటనే పోలీసులకు తెలిపి సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది. కాలం మారుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసం చేస్తున్నారు. అమాయక మహిళలను ఆసరాగా చేసుకొని వారి నుంచి సింపతి కొట్టేసి డబ్బలుు మాయం చేస్తున్నారు. అయితే ఆ మహిళ చెప్పిన ప్రకారం.. సదరు వ్యక్తి బ్యాంకు అకౌంట్ నుంచి కాకుండా ఓ ప్రైవేట్ నెంబర్ నుంచి బ్యాంకులు వచ్చాయని తిరిగి పంపించగా అధిక మొత్తంలో డబ్బలు నష్టపోయానని మహిళ తెలిపింది./