https://oktelugu.com/

Canada: కెనడాలో భారతీయుల అరెస్ట్‌.. ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు

కెనడాలో శనివారం సిక్కు సంస్కృతి, వారసత్వాన్ని గుర్తుచేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రూడో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనడాలో చట్టబద్ధమైన పాలన సాగుతోందని తెలిపారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 5, 2024 / 03:10 PM IST

    Canada

    Follow us on

    Canada: ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత భారత్‌–కెనడా మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇప్పటికీ అది కొనసాగుతోంది. తాజాగా ఈ హత్య కేసుకు సంబంధించి ముగ్గురు భారత వ్యక్తులను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఆ దేశ ప్రధాని జస్టిన్‌ 6టూడో స్పందించారు. తమ దేశ పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

    సిక్కు సంస్కృతి, వారస్వ కార్యక్రమం..
    కెనడాలో శనివారం సిక్కు సంస్కృతి, వారసత్వాన్ని గుర్తుచేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రూడో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనడాలో చట్టబద్ధమైన పాలన సాగుతోందని తెలిపారు. దేశ పౌరుల రక్షణ, భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దేశంలో శక్తివంతమైన, స్వతంత్రతతో కూడిన న్యాయ వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. నిజ్జర్‌ హత్య తర్వాత కెనడాలోని సిక్కులు అభద్రతకు లోనవుతున్నారన్నారు. హింస, వివక్షకు తావులేకుండా స్వేచ్ఛగా జీవించడం ప్రతీ కెనడా పౌరుడి హక్కు అని అన్నారు.

    భారతీయుల అరెస్టుపై కేంద్రం స్పందన..
    మరోవైపు కెనడాలో ముగ్గురు భారతీయుల అరెస్టుపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.శంకర్‌ స్పందించారు. ‘ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు త్వరలో ఎన్నికలు జరుగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవే అని పేర్కొన్నారు. ఈ విషయాల్లో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అరెస్టు అయిన ముగ్గురు ఏదో ఒక గ్యాంగ్‌కు చెందిన వారని తెలుస్తోందన్నారు. దీనిపై కెనడా పోలీసుల ప్రకటన కోసం చూస్తున్నట్లు వెల్లడించారు.