https://oktelugu.com/

Crime : అత్యాధునిక సాంకేతిక పరికరాలు.. గంజాయి స్మగ్లింగ్ పై ఉక్కుపాదం

చెక్ పోస్టులను అలెర్ట్ చేస్తూ, ఎప్పటికప్పుడు సమాచారం సమన్వయం చేసుకుంటూ వాహనాలు తనికీ చేస్తూ పెద్ద ఎత్తున గంజాయి రవాణాను కట్టడి చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2024 / 09:34 PM IST

    TANA Foundation (1)

    Follow us on

    * రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల జాయింట్ ఆపరేషన్
    * సరిహద్దుల్లో గంజాయి స్మగ్లింగ్ కు చెక్
    * పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం
    * అత్యాధునిక సాంకేతిక పరికరాలతో నిఘా

    Crime : గంజాయి స్మగ్లింగ్ నియంత్రణ కు రెండు తెలుగు రాష్టాల జాయింట్ ఆపరేషన్ అప్రతిహతంగా కొనసాగుతోంది. డ్రగ్, గంజాయి మాఫియాను తుద ముట్టించాలని, ఇద్దరు ముఖ్యమంత్రులు కృతనిశ్చయంతోస్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నారు.

    ఏవోబీ (ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్), ఛత్తీస్ ఘడ్ నుంచి  గంజాయి స్మగ్లింగ్ నియంత్రణ కు స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో పాటు లోకల్ పోలీసుల సహకారంతో పకడ్బందీగా వ్యూహాలను రూపొందిస్తూ, ఎప్పటికప్పుడు సమాచారం సమన్వయం చేసుకుంటూ స్మగ్లింగ్ పై ఉక్కు పాదం మోపుతున్నారు. తెలంగాణలో ANB (యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) ఏర్పాటు చేసి డైరెక్టర్ గా సందీప్ శాండిల్య ను నియమించారు.

    గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలుగు రాష్ట్రాల మీదుగా మహారాష్ట్ర, తమిళనాడుకు, అలాగే ముంబాయి, విశాఖపట్నం, సాలెం మీదుగా విదేశాలకు పెద్ద ఎత్తున గంజాయి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న స్మగ్లర్ల ను పోలీసులు చాకచక్యంగా పట్టుకుంటున్నారు. వారి వద్ద పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు.

    * ఆగస్టు 18న విశాఖ పట్నం నుంచి సాలెం, తమిళనాడు కు అక్రమ మార్గంలో తరలిస్తున్న 199 కిలోల గంజాయిని రాజనగరం హైవే వద్ద పోలీసులు స్వాధీనం చేసుకొని మరిమత్తు అరుగం, వాలే మురుగన్ అనే ఇద్దరు నిందితుల గల ముఠాను అరెస్టు చేశారు. ఈ సంవత్సరం రాజనగరం పోలీస్ స్టేషన్ పరిదిలో రూ. 25 లక్షల విలువైన 506 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

    * రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో వేల కిలోల గంజాయి తరిస్తున్న కంటైనర్ ను పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు.

    * తాజాగా సెప్టెంబర్ 27న పట్టపగలు చత్తీస్గడ్ నుంచి హైదరాబాద్ కు కారులో అక్రమంగా తరలిస్తున్న 31.75 లక్షల రూపాయల విలువైన 127 కిలోల ఎండు గంజాయిని మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీసులు పట్టుకున్నారు. గాలి వారి గూడెం స్టేజి వద్ద చత్తీస్గఢ్ కు చెందిన సోడి నాగేశ్వరరావు అరెస్ట్ చేయడంతో పాటు కారు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

    -సరిహద్దులపై నిఘా తీవ్రతరం

    గంజాయి సాగు విఒరీతంగా ఉన్న ఛత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతం నుంచి అటు ఒరిస్సా సరిహద్దులోని శ్రీకాకుళం, విశాఖపట్నం, ఇటు ఖమ్మం, మహారాష్ట్ర సరిహద్దులోని భూపాలపల్లి, పెద్దపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల మీదుగా తరించేందుకు వీలుగా, అవకాశమున్న అన్ని రహదారులపై పోలీసులు నిఘా నేత్రం ఉంచారు. చెక్ పోస్టులను అలెర్ట్ చేస్తూ, ఎప్పటికప్పుడు సమాచారం సమన్వయం చేసుకుంటూ వాహనాలు తనికీ చేస్తూ పెద్ద ఎత్తున గంజాయి రవాణాను కట్టడి చేస్తున్నారు.

    – ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో..

    విజయనగరం పోలీసులు పిట్టడ, బొబ్బిలి, తుమ్మికపల్లి, కొట్టక్కి వద్ద కొత్తగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు ఉన్న బొడ్డవార చెక్ పోస్టు లో అదనపు బలగాలను ఉంచారు. అరకు, విశాఖపట్నం మీదుగా స్మగ్లింగ్ జరుగకుండా ఈ చెక్ పోస్టులు నియంత్రిస్తాయని అక్కడి పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
    ఇప్పటివరకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న, అమ్ముతున్న, వాడుతున్న 65 మందిని ఈ వారంలోనే 65 మందిని అరెస్ట్ చేసినట్లు విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. 22 కేసులు పెట్టారు. గంజాయి నియంత్రణకు ఐదు స్పెషల్ టీములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాగే కట్టుదిట్టమైన చర్యలు కొనసాగించాలని కోరుకుంటున్నారు.

    – దహగాం శ్రీనివాస్