Devara: ఈ ఏడాది రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ చిత్రం 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం లాంగ్ రన్ లో మాత్రమే కాదు, ఓపెనింగ్స్ లో కూడా ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. #RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి రాబడితే, కల్కి చిత్రం 193 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వసూళ్లను మన స్టార్ హీరోల రాబోయే పాన్ ఇండియన్ చిత్రాలలో ఎదో ఒకటి అధిగమిస్తుంది అని అందరూ అనుకున్నారు. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం దగ్గరకు వెళ్లొచ్చని అనుకున్నారు.
ఎందుకంటే #RRR వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న చిత్రం కావడం, దానికి తోడు ఈ సినిమాలోని పాటలు ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అవ్వడమే. అయితే ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కల్కి రేంజ్ ఓపెనింగ్స్ దక్కడం అసాధ్యం అని అంటున్నారు. కనీసం దరిదాపుల్లోకి వెళ్లే అవకాశం కూడా లేదట. ‘కల్కి’ చిత్రానికి కేవలం తెలుగు లో మాత్రమే కాదు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా మంచి ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘దేవర’ చిత్రానికి కేవలం తెలుగు వర్షన్ నుండి మాత్రమే ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. మిగిలిన భాషల్లో అంతంత మాత్రంగానే ఓపెనింగ్ ని దక్కించుకుంది. ముఖ్యంగా హిందీ లో ‘దేవర’ కంటే ‘కల్కి’ చిత్రం మొదటి రోజు 5 రెట్లు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. హిందీ లో ‘దేవర’ చిత్రానికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ని చూసి రెండు కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు అయినా వస్తాయో రావో అని అనుకున్నారు. కానీ డీసెంట్ స్థాయి నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం మొదటి రోజు ఈ చిత్రానికి 5 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వస్తాయట. అలాగే ఈ చిత్రం నార్త్ అమెరికా లో కూడా కల్కి ప్రీమియర్స్ రికార్డ్స్ ని బద్దలు కొట్టలేకపోయింది.
కల్కి చిత్రానికి ప్రీమియర్స్ నుండి 3.2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు ప్రీమియర్ షోస్ నుండి రాయగా, దేవర చిత్రానికి కేవలం 2.8 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా దేవర చిత్రానికి 110 నుండి 120 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వీకెండ్ వరకు వసూళ్లకు ఎలాంటి ఢోకా లేదని, ఫుల్ రన్ లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే ఈ చిత్రానికి 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు. ఒకవేళ వర్కింగ్ డేస్ లో ఈ చిత్రం అనుకున్న స్థాయి వసూళ్లను రాబట్టలేకపోతే ఫుల్ రన్ లో 400 కోట్ల రూపాయిల కంటే తక్కువ వచ్చిన రావొచ్చినా అంటున్నారు.