Kerala: అది కేరళ రాష్ట్రం. కొచ్చిన్ ప్రాంతం.. అక్కడ ఓ యువతీ ఎంబీఏ చదువుతోంది. ఆమెకు 24 ఏళ్ల వయసు ఉంటుంది. ఆమె తోటి విద్యార్థితో ప్రేమ వ్యవహారంలో ఉంది. అది కాస్త శారీరక సాన్నిహిత్యానికి దారి తీసింది.. ఇలా చాలా రోజులపాటు వారు శారీరకంగా కలిశారు. దీంతో ఆమె గర్భం దాల్చింది.. అలా కడుపులో ఉన్న శిశువు పెరిగి పెద్దదయింది. ఈ క్రమంలో ఆమె శుక్రవారం ఉదయం ఆ శిశువుకు జన్మనిచ్చింది. అంతేకాదు తాను జన్మనిచ్చిన శిశువును ఏ మాత్రం కనికరం లేకుండా రోడ్డుమీదికి విసిరేసింది..
ఆ యువతి కొచ్చిన్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లో ఉంటోంది. ఒంటరిగా ఉంటున్నదా? తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నదా? అనేది తెలియదు గానీ.. శుక్రవారం ఉదయం తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ లోని బాత్ రూం లో శిశువుకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత అమెజాన్ కవర్లో చుట్టి రోడ్డుపైకి విసిరేసింది. అలా విసిరేయడంతో ఆ శిశువు ప్రాణాలు కోల్పోయింది. ఆ రోడ్డు పైనుంచి వస్తున్న కొందరు పారిశుద్ధ్య కార్మికులు ఆ కవర్ చూశారు. దానిమీద ఉన్న అడ్రస్ ఆధారంగా పోలీసులకు సమాచారం అందించారు. ఆ కవర్ పై ఉన్న అడ్రస్ ఆధారంగా పోలీసులు నిందితురాలిని గుర్తించారు.
24 సంవత్సరాల వయసు ఉన్న ఆ యువతి కొచ్చిన్ ప్రాంతంలో ఎంబీఏ చదువుతోంది.. తోటి విద్యార్థితో కొంతకాలంగా ప్రేమలో ఉంది. అది కాస్త శారీరక సాన్నిహిత్యానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది.. వాస్తవానికి గర్భం దాల్చిన సమయంలో గర్భ విచ్చిత్తి (అబార్షన్) ఎందుకు చేయించుకోలేదనే ప్రశ్న తలెత్తుతోంది.. 9 నెలల దాకా గర్భం అలానే ఎందుకు ఉంచుకుంది? 9 నెలల గర్భ సమయంలో ఆడవాళ్ళ పొట్ట భాగం బాగా పెరుగుతుంది కదా.. అలాంటప్పుడు.. ఆ విద్యార్థినిని ఎవరూ గమనించలేదా? లేకుంటే ఆపరాధ భావంతో ఆ విద్యార్థిని కళాశాలకు వెళ్లలేదా? అపార్ట్మెంట్లో ఒక్కతే ఉంటున్నదా? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.