Homeక్రైమ్‌Actor Darshan: పేరుకే దర్శన్ డీ స్టార్.. చేసినవన్నీ బీ గ్రేడ్ పనులే.. ప్రియురాలి కోసం...

Actor Darshan: పేరుకే దర్శన్ డీ స్టార్.. చేసినవన్నీ బీ గ్రేడ్ పనులే.. ప్రియురాలి కోసం అభిమానినే హత్య చేయించిన ఘనుడు

Actor Darshan: కన్నడ చిత్ర సీమలో చాలెంజింగ్ స్టార్ గా దర్శన్ కు పేరుంది. వరుస బ్లాక్ బ్లాస్టర్ లతో “డీ స్టార్” గా పేరు పొందాడు. కర్ణాటక వ్యాప్తంగా ఇతడికి విపరీతంగా అభిమానులు ఉన్నారు. ప్రత్యేక సంఘాలు కూడా ఉన్నాయి.. అయితే ఈ నటుడు హత్య కేసులో అరెస్ట్ కావడం కన్నడ చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు, యావత్ సినీ పరిశ్రమనే ఉలిక్కిపడేలా చేసింది. దర్శన్ కు ఇంతకుముందే విజయలక్ష్మి అనే మహిళతో వివాహం అయింది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. గతంలో విజయలక్ష్మిపై దాడి చేసిన కేసులో ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. గృహ హింస కేసు నేపథ్యంలో 14 రోజులపాటు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చాడు.

పవిత్ర గౌడతో సంబంధం

తనకున్న స్టార్ డం తో అభిమానులకు ఆదర్శంగా నిలవాల్సిన దర్శన్.. ప్రతిసారీ వివాదాస్పద పనులతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటాడు. వివాదాస్పద మాటలు, చేష్టలతో పరువు పోగొట్టుకుంటాడు. అయినప్పటికీ అభిమాన గణం దర్శన్ ను ఆకాశానికి ఎత్తేస్తుంటారు. గతంలో దర్శన్ హీరోయిన్ నిఖిత తో ప్రేమయాణం నడిపాడని వార్తలు వినిపించాయి. అదే అప్పట్లో విజయలక్ష్మి హెచ్చరికలు జారీ చేయడంతో దర్శన్ తన తీరు మార్చుకున్నాడని వినికిడి. నిఖిత మాత్రమే కాదు, గతంలో కూడా చాలామంది నటీమణులతో దర్శన్ సంబంధాలు నడిపాడని కన్నడ చిత్రసీమలో పుకార్లు వినిపించాయి.. ఇక 2013లో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పవిత్ర గౌడతో దర్శన్ వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. పవిత్రకు గతంలో సంజయ్ అనే వ్యక్తితో పెళ్లయింది. వీరికి ఖుషి అనే కుమార్తె ఉంది. అయితే భర్తకు విడాకులు ఇచ్చి దర్శన్ తో సహజీవనం చేస్తోంది.. ఇటీవల దర్శన్ తో తనకు బంధం కొనసాగుతోందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది. ఈ పోస్ట్ పెట్టిన అనంతరం దర్శన్ కుటుంబంలో కలహాలు మొదలయ్యాయని తెలుస్తోంది.. అంతేకాదు దర్శన్ తో కలిసి దిగిన ఫోటోలను పవిత్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే అభిమానులు వార్నింగ్ ఇవ్వడంతో ఆమె వెనక్కి తగ్గిందని తెలుస్తోంది.

పదేళ్ల నుంచి రిలేషన్

ఇటీవల తన కూతురు ఖుషి పుట్టినరోజు సందర్భంగా పలు ఫొటోలను పవిత్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..” నేను, దర్శన్ పది సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉన్నాం. ఈ విషయం దర్శన్ భార్య విజయలక్ష్మి కూడా తెలుసని” పేర్కొంది.. ఈ క్రమంలోనే రేణుకాస్వామి ఎంటర్ అయ్యాడు.. రేణుకా స్వామి దర్శన్ కు వీరాభిమాని. అయితే తన అభిమాన నటుడి సంసారం పవిత్ర వల్ల కకావికలం అవుతోందని భావించి.. సోషల్ మీడియా వేదికగా బెదిరింపు సందేశాలు పంపాడు. అయితే ఆకస్మాత్తుగా రేణుక స్వామి దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.. అతడి మృతదేహం కామాక్షి పాళ్య లోని కో అపార్ట్మెంట్ సమీపంలోని డ్రైనేజీలో లభించింది.. రేణుక స్వామికి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్న నేపథ్యంలోనే తట్టుకోలేక దర్శన్ రేణుక స్వామి హత్య చేయించి, డ్రైనేజీలో పడేశాడని ఆరోపణలు ఉన్నాయి.. ఈ వ్యవహారంలో దర్శన్, అతని ప్రియురాలు పవిత్రతో సహా 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version