Woman Hulchul : నడిరోడ్డుపై తప్పతాగుతూ యువతి చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్..

అది వాకింగ్ చేసుకునే ట్రాక్.. తెల్ల తెల్లవారంగానే ఒక కారులో యువతీ, యువకుడు వచ్చారు. ట్రాక్ పై కారును నిలిపి బీర్లు, సిగరెట్లు తాగడం మొదలు పెట్టారు.

Written By: NARESH, Updated On : May 24, 2024 8:13 pm

Young Women

Follow us on

Woman Hulchul : సాధారణంగా.. ఉదయం వేళ ఎవ్వరైనా ఏం చేస్తారు. వాకింగ్, ఎక్స్ సైజ్, లేదంటే టీ, కాఫీ తాగడం లేదంటే టిఫిన్ చేయడం చేస్తుంటారు. కానీ ఒక యువతి ఉదయమే బీరు, సిగరేట్ తో రోజును మొదలు పెట్టింది. పైగా అది కూడా అందరూ వాకింగ్ చేసే ట్రాక్ పైనే.. వాకింగ్ కోసం వచ్చిన పెద్దవారు ఇది తప్పమ్మా అన్నందుకు ‘మీ ఫ్యామిలీలో ఎవరూ లేరా?’ అంటూ వారిపైనే వీరంగం సృష్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

తను ఆడపిల్ల అని మరిచిన యువతి చేతిలో సిగరేట్, మరో చేతిలో బీరు బాటిల్ పట్టుకొని దర్జాగా కారుకు ఒరిగి మరీ తాగుతూ.. పొగ పీలుస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఆమె ప్రైవసీకి భంగం కలిగించారని పెద్దవారిపై నోరు పారేసుకుంది. ఇది జరిగింది ఎక్కడో కాదు.. హైదరాబాద్- నాగోల్ పరిధిలోని ఫతుల్లాగూడ సమీపంలోని రోడ్డుపై.

అది వాకింగ్ చేసుకునే ట్రాక్.. తెల్ల తెల్లవారంగానే ఒక కారులో యువతీ, యువకుడు వచ్చారు. ట్రాక్ పై కారును నిలిపి బీర్లు, సిగరెట్లు తాగడం మొదలు పెట్టారు. చక్కటి ప్రకృతిని చూస్తూ స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు వచ్చిన వారు తాగడం, సిగరేట్ పొగను పీల్చుకుంటూ ఉండడం తట్టుకోలేక వాకర్స్ కొంచెం ప్రశ్నించారు.

దీంతో ఒక సీనియర్ సిటిజన్ పై నోరు పారేసుకుంది సదరుయువతి. పెద్ద ఎత్తున అతనితో వాగ్వాదానికి దిగింది. ‘మా పాటికి మేము తాగుతున్నాం.. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నామా? మీరెప్పుడు తాగలేదా? మీ వయసుకు సిగ్గు ఉండాలి, మీ పిల్లల వీడియోలు ఇలాగే అంటారా..?’ అంటూ వితండవాదం చేస్తూ రెచ్చిపోయింది యువతి.

దీంతో.. వాకింగ్ కు వచ్చిన వారితో పాటు స్థానికులుగుమిగూడి గట్టిగా వారించడంతో.. అక్కడి నుంచి ఉడాయించారు. యువతి వ్యవహారాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి వారిని లాకప్ లో పడేయాలని కొదరు అంటే.. తాగి రచ్చ చేయడమే కాకుండా పెద్దవారితో ఉల్టా మాట్లాడడం ఏంటి.’? అని ఓ నెటిజన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.