https://oktelugu.com/

Rave Party : రేవ్ పార్టీ కేసు: అక్కడ నటి హేమ చేసిన పని చూసి విస్తుపోయిన పోలీసులు.. షాకింగ్ నిజాలు!

. రేవ్ పార్టీలో పాల్గొని అడ్డంగా బుక్ అయిన హేమ తిరిగి బుకాయించిన తీరు చర్చనీయాంశం అవుతుంది. మూడు దశాబ్దాలకు పైగా హేమ చిత్ర పరిశ్రమలో ఉన్నారు. నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమెకు మంచి పేరుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 24, 2024 / 08:01 PM IST

    Rave Party Case, Actress Hema

    Follow us on

    Rave Party : బెంగళూరులోని ఓ ఫార్మ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీ ప్రకంపనలు రేపుతోంది. ఈ పార్టీలో కొందరు టాలీవుడ్ నటులు పాల్గొనడం చర్చకు దారి తీసింది. ఓ బడా షాట్ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వాడటం కలకలం రేపింది. నటుడు శ్రీకాంత్, జానీ మాస్టర్, నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. శ్రీకాంత్, జానీ మాస్టర్ ఉన్నారన్న వార్తల్లో నిజం లేదని తేలింది. ఈ పుకార్లను వారు ఖండించారు. రేవ్ పార్టీ న్యూస్ బయటకు రాగానే నటి హేమ వీడియో బైట్ విడుదల చేసింది.

    ఆమె ఒక ఫార్మ్ హౌస్లో ఆ వీడియో చేశారు. హేమ మాట్లాడుతూ… నేను బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను ఇక్కడే హైదరాబాద్ లోని ఓ ఫార్మ్ హౌస్లో ఉన్నాను. చిల్ అవుతున్నాను. ఎంజాయ్ చేస్తున్నాను. అసత్య ప్రచారం నమ్మవద్దు, అని సదరు వీడియోలో వెల్లడించారు. కానీ హేమ రేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ నుండే ఆ వీడియో చేశారు. బెంగుళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలో ఉన్న డ్రెస్, హేమ వీడియో బైట్ లో ధరించిన డ్రెస్ సేమ్.

    కాగా హేమ సాధారణ జనాలను బురిడీ కొట్టించినట్లే… పోలీసులను కూడా మోసం చేశారని తెలుస్తోంది. హేమ మరొక పేరుతో పార్టీలో పాల్గొన్నారట. అదే పేరు పోలీసులకు చెప్పారట. తన పేరు కృష్ణవేణి అని పోలీసులకు చెప్పారట. నిజానికి హేమ అసలు పేరు కృష్ణవేణినే. కానీ స్క్రీన్ నేమ్ హేమ అంటేనే అందరికీ తెలుసు. కృష్ణవేణి అని చెప్పడం ద్వారా తన ఐడెంటిటీ దాచే ప్రయత్నం చేసింది.

    ఇక హేమ రక్త నమూనాలు సేకరించగా పాజిటివ్ అని వచ్చిందట. ఆమె డ్రగ్ తీసుకున్నట్లు నిరూపితమైంది. హేమ పోలీసులను బెదిరించినట్లుగా కూడా తెలుస్తుంది. తన ఐడెంటిటీ రివీల్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను హెచ్చరించారట. రేవ్ పార్టీలో పాల్గొని అడ్డంగా బుక్ అయిన హేమ తిరిగి బుకాయించిన తీరు చర్చనీయాంశం అవుతుంది. మూడు దశాబ్దాలకు పైగా హేమ చిత్ర పరిశ్రమలో ఉన్నారు. నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమెకు మంచి పేరుంది.