https://oktelugu.com/

Crime News : లెక్కల టీచర్ కాదామే.. కామపిశాచి.. ఏకంగా ఇద్దరు విద్యార్థులతో సంబంధం.. గర్భవతి

అతడి సమ్మతితోనే లైంగిక ఆనందం పొందిందట. గర్భం కూడా తనకు ఇష్టమయ్యే దాల్చానని ఆ ఉపాధ్యాయురాలు ప్రకటించడం విశేషం. ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతోంది. దీనిపై అక్కడి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 9, 2024 / 10:56 AM IST

    A teacher who got pregnant after having an affair with a student in UK

    Follow us on

    Crime News : తల్లిదండ్రుల తర్వాత.. ఆ స్థాయిలో గౌరవం దక్కేది.. గౌరవించాలనిపించేది గురువులనే. ఆ గురువులే పిల్లలను దారి తప్పకుండా చూస్తారు. జీవితాల్లో స్థిరపడేలా చేస్తారు. విద్య నేర్పి, విలువలు నేర్పి అద్భుతమైన సమాజం ఏర్పడేందుకు కృషి చేస్తారు. అలాంటి గురుతర స్థానంలో ఉన్న ఓ ఉపాధ్యాయురాలు దారి తప్పింది. గణితం చెప్పాల్సింది పోయి.. పిల్లలకు ఆ పాఠాలు నేర్పింది. ఇప్పుడు సమాజం ముందు తలదించుకొని, ద్రోహిగా నిలబడింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

    యూకే లోని ఓ ఉపాధ్యాయురాలు శ్రద్ధగా విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది పోయి గీత దాటింది. తన వద్ద గణితం నేర్చుకుంటున్న టీనేజ్ పిల్లలపై కన్నేసింది. తనకంటే వయసులో తీవ్రమైన వ్యత్యాసం ఉన్నప్పటికీ.. ఓ విద్యార్థిని తన బుట్టలో వేసుకుంది. తన శరీర కోరికలు తీర్చుకుంది. అయితే ఈ విషయం సంచలనంగా మారింది. కోర్టు దాకా వెళ్ళింది. ఈ కేసులో ఆ ఉపాధ్యాయురాలు బెయిల్ పై బయటకు వచ్చింది. అయినప్పటికీ ఆమె బుద్ధి మారలేదు. పైగా మరో టీనేజ్ యువకుడి పై కన్నేసింది. తాను నివాసం ఉండే అపార్ట్మెంట్ కు తీసుకెళ్లింది. అతని ద్వారా లైంగికంగా సుఖం పొందడం ప్రారంభించింది. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ ఉపాధ్యాయురాలు గర్భం దాల్చింది. ఆ విషయం బయటపడటంతో సంచలనంగా మారింది.

    బ్రిటన్ దేశానికి చెందిన లిల్లీ(పేరు మార్చాం) ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. 2021 లో ఓ బాలుడికి గణితంలో అదనపు తరగతులు చెబుతానని తన వద్దకు రప్పించుకునేది. ఆ సమయంలో పాఠాలకు బదులుగా అతడికి సవాళ్లు విసిరేది. తన ఫోన్ నెంబర్లో ఒక అంకె తప్ప మిగిలినవి మొత్తం చెప్పింది. తన మొబైల్ నెంబర్ ఏమిటో తెలుసుకోవాలని అతడికి సవాల్ విసిరింది. దానిని ఆ ఆ విద్యార్థి చాలెంజ్ గా తీసుకొని, ఆమె నెంబర్ కనిపెట్టాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య సందేశాలు మొదలయ్యాయి. అలా వారిద్దరి మధ్య బంధం బలపడింది. ఒకరోజు ఆ విద్యార్థిని ని షాపింగ్ తీసుకెళ్లిన ఆ ఉపాధ్యాయురాలు.. 345 ఫౌండ్లు ఖరీదు చేసే ఒక బెల్ట్ కొనిచ్చింది. ఆ తర్వాత అతడిని అపార్ట్మెంట్ కు తీసుకెళ్ళింది. అక్కడ వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఈ విషయం కొద్దిరోజులు గుట్టుగా సాగింది. ఒకరోజు ఆ విద్యార్థి ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడంతో.. అది పోలీసుల దాకా వెళ్ళింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె బయటికి వచ్చింది.

    అలా బయటికి వచ్చినప్పటికీ ఆ ఉపాధ్యాయురాలు తన తీరు మార్చుకోలేదు. పైగా స్నాప్ చాట్ ద్వారా పరిచయమైన విద్యార్థిని ని తన మైకంలో పడేలా చేసింది. తన వ్యక్తిగత ఫోటోలు అందరికీ పంపించి అతడిని తన దారిలోకి తెచ్చుకుంది. అతనితో కూడా పడక సుఖాన్ని అనుభవించింది. అతని వల్ల ప్రస్తుతం ఆమె గర్భం దాల్చింది. అయితే కోర్టులో కేసు నడుస్తుండగా.. ఆ ఉపాధ్యాయురాలు తన తప్పును ధైర్యంగా ఒప్పుకుంది. అయితే ఆమె చేసింది తప్పు కాదట. 16 సంవత్సరాలు నిండిన తర్వాతే ఆ విద్యార్థితో సంబంధం పెట్టుకుందట.. అతడి సమ్మతితోనే లైంగిక ఆనందం పొందిందట. గర్భం కూడా తనకు ఇష్టమయ్యే దాల్చానని ఆ ఉపాధ్యాయురాలు ప్రకటించడం విశేషం. ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతోంది. దీనిపై అక్కడి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.