https://oktelugu.com/

Kajal: డైరెక్టర్ ఏడవమంటే తొలిరోజు షూట్ లో కాజల్ చేసిన పని వైరల్…

బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు 'సత్యభామ ' అనే సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తూ మరోసారి సక్సెస్ కొట్టడానికి రెడీ అవుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : May 9, 2024 / 10:51 AM IST

    Kajal Says Interesting Thing About Debut Movie Audition

    Follow us on

    Kajal: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన వాళ్ళలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె దాదాపు 15 సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది.ఇక ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరితో కలిసి నటించడమే కాకుండా ప్రతి ఒక్క హీరోతో కూడా బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందుకుంది. ఇక ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయింది. అయినప్పటికీ అడపాదడపా కొంతమంది సీనియర్ హీరోలతో సినిమాలను చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది.

    ఇక అందులో భాగంగానే బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు ‘సత్యభామ ‘ అనే సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తూ మరోసారి సక్సెస్ కొట్టడానికి రెడీ అవుతుంది. ఇక అందులో భాగంగానే ఆమె ఆలీ టాక్ షో ప్రోగ్రాంలో పాల్గొంది. ఇక రీసెంట్ గా ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేశారు. అందులో ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేసింది. ఇక తను లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా కోసం తేజ ఆడిషన్స్ నిర్వహిస్తున్న సమయంలో కాజల్ అగర్వాల్ ఫోటోను చూసి తేజ తనని ఆడిషన్ కి పిలిచారట.

    ఇక ఆ ఆడిషన్ లో తేజ ఏడవమని చెప్పగా కాజల్ మాత్రం ఇప్పటి వరకు నేను ఏడవడానికి గల కారణాలు ఏవి లేవు కాబట్టి నాకు ఏడుపు రావడం లేదు అని చెప్పిందట. కానీ ఆడిషన్ అంటే అలా ఉండదు కదా వాళ్ళు చెప్పింది చేయాలి. కాబట్టి వాళ్ల నాన్న వచ్చి కాజల్ అగర్వాల్ ఏడవడానికి గల ఒక కారణాన్ని చెప్పారట. దాంతో ఆగకుండా ఏడుస్తూ ఉందట. ఇక మొత్తానికైతే ఆమె యాక్టింగ్ ను చూసిన తేజ తనని హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు.

    నిజానికి ఆడిషన్ కి వెళ్ళినప్పుడు ఏదైనా చేయడానికి రెడీ గా ఉండాలి. అది కుదరదు, ఇది రాదు అంటే వాళ్లు ఆ క్యారెక్టర్ నుంచి వారిని రిజెక్ట్ చేస్తారు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం చాలా అమాయకంగా అలా చెప్పడంతో తేజకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదట. ఇక మొత్తానికైతే తను మళ్ళీ ఏడ్చి సినిమాలో సెలెక్ట్ అయింది. ఇక అలా వచ్చిన అవకాశాన్ని వాడుకున్న కాజల్ ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా కూడా ఎదగడం విశేషం…