https://oktelugu.com/

Crime News : ఘోరం.. భార్య రోజూ అందంగా తయారవుతుందని చంపేసిన భర్త!

కర్ణాటకలోని రామనగర జిల్లాలోని మాగడికి చెందిన ఉమేశ్ దివ్యను వివాహం చేసుకున్నాడు. అయితే ఉమేశ్‌కి తన భార్య అందంగా తయారవ్వడం ముందు నుంచే నచ్చేది కాదు. కానీ దివ్యకు మాత్రం అందంగా తయారవ్వడం అంటే ఇష్టం.

Written By:
  • NARESH
  • , Updated On : August 15, 2024 / 04:01 PM IST

    Husband killed His Wife

    Follow us on

    Crime News : సాధారణంగా అమ్మాయిలు పెళ్లికి ముందు బాగా రెడీ అవుతారు. కానీ పెళ్లయిన తర్వాత మాత్రం అసలు రెడీ కారు. ఎప్పుడూ నైటీలోనే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో భర్తలు భార్యలను తిడతారు. చాలా మంది భర్తలు తన భార్య అందంగా ఉండాలని, మంచిగా రెడీ అయ్యి ఉండాలని చాలామంది భర్తలు భావిస్తారు. కానీ కర్ణాటకకి చెందిన ఓ వ్యక్తి మాత్రం దీనికి రివర్స్. తన భార్య అందంగా తయారవ్వడం నచ్చక ఆమెను నమ్మించి హతమార్చాడు. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది. భార్య అందంగా తయారైతే ఆమెను చంపే అంత శాడిజం ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

    కర్ణాటకలోని రామనగర జిల్లాలోని మాగడికి చెందిన ఉమేశ్ దివ్యను వివాహం చేసుకున్నాడు. అయితే ఉమేశ్‌కి తన భార్య అందంగా తయారవ్వడం ముందు నుంచే నచ్చేది కాదు. కానీ దివ్యకు మాత్రం అందంగా తయారవ్వడం అంటే ఇష్టం. అందుకే అందంగా కనిపించడానికి రోజూ మేకప్ వేసుకుని లిప్‌స్టిక్ రాసుకునేది. కేవలం ఇంట్లోనే కాకుండా బయటకు వెళ్లిన కూడా ఇలానే రెడీ అవుతుందట. దివ్య ఇలా అందంగా రెడీ అయి, లిప్‌స్టిక్ రాసుకోవడం ఉమేశ్‌కి ముందునుంచే నచ్చేది కాదు. దీంతో ఎప్పుడు ఆమెతో గొడవ పడేవాడు. అలా దివ్యను అనుమానించేవాడు. దీంతో ఆమె కొన్ని రోజుల కిందట మాగడి ఫ్యామిలీ కోర్టులో విడాకులు పిటిషన్ వేశారు. ఈక్రమంలో దివ్య, ఉమేశ్ విచారణకు కోర్టుకు వెళ్లారు.

    విడాకులు పిటిషన్ నేపథ్యంలో ఇద్దరూ విచారణకు హాజరయ్యారు. ఇకపై తనని అనుమానించనని ఉమేశ్ దివ్యను నమ్మించాడు. నిజంగానే భర్త మారాడని దివ్య నమ్మింది. విచారణ పూర్తయిన తర్వాత భర్తతో కలిసి దేవాలయంకి వెళ్లింది. భర్త ఇకపై మంచిగా ఉంటాడని భర్తను నమ్మి అతనితో కలిసి వెళ్లింది. అయితే ఉమేశ్ మాత్రం దివ్యను హత్య చేయాలని ముందే నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే ప్లాన్‌లో భాగంగా దివ్యను నమ్మించాడు. ఆ తర్వాత గుడికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. భర్తను నమ్మిన దివ్య అతనితో ఊజగల్లు దేవాలయానికి వెళ్లింది. అలా ఆ గుడి దగ్గర ఉన్న ఓ కొండ వద్దకు ఉమేశ్ దివ్యను తీసుకెళ్లాడు. తన భర్తే కదా అని నమ్మి అతనితో పోయింది. కానీ ఉమేశ్ తన నలుగురు స్నేహితులతో కలిసి దివ్యను హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృత దేహాన్ని అడవులో పడేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. హత్య చేసిన వారిలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు ఉమేశ్, మరో వ్యక్తి ఆచూకీ ఇంకా దొరకలేదు. వాళ్ల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.