https://oktelugu.com/

Siddipet: జల్సాలకు అలవాటు.. డబ్బు కోసం యజమాని కుమారుడిపై కన్ను.. ఆ తర్వాత ఆ వివాహిత ఏం చేసిందంటే..

ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట లోని హనుమాన్ నగర్ లో ఓ వివాహిత తన కుటుంబంతో కలిసి మూడు సంవత్సరాల క్రితం ఇంట్లో అద్దెకు దిగింది. భర్త ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా.. ఆమె కూడా పలు పనులు చేస్తూ జీవిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 16, 2024 / 03:05 PM IST

    Siddipet

    Follow us on

    Siddipet: ఆమెకు తాగుడు అంటే ఇష్టం. తినడం అంటే చాలా ఇష్టం. రోజుకు తక్కువలో తక్కువ నాలుగు బీర్లు లాగిస్తుంది. అంతేకాదు ఖరీదైన చీరలు కట్టుకోవాలని.. విలువైన నగలు వేసుకోవాలని.. టిప్ టాప్ గా తయారై పదిమందిలో ప్రత్యేకంగా కనిపించాలని ఆమెకు కోరిక.. తినుడు, తాగుడు వరకైతే ఓకే గాని.. మిగతావన్నీ సమకూరాలి అంటే డబ్బులు కావాలి. ఆమె చేసే పని అంతంత మాత్రమే కావడంతో ఆ స్థాయి లగ్జరీ లైఫ్ అనుభవించడం దాదాపు అసాధ్యం. కానీ దానికోసం ఆమె తప్పటడుగులు వేసింది. సభ్య సమాజం ముందు తలదించుకునే పని చేసింది.

    ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట లోని హనుమాన్ నగర్ లో ఓ వివాహిత తన కుటుంబంతో కలిసి మూడు సంవత్సరాల క్రితం ఇంట్లో అద్దెకు దిగింది. భర్త ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా.. ఆమె కూడా పలు పనులు చేస్తూ జీవిస్తోంది. మొదటినుంచి ఆమెకు జల్సాగా బతకడం ఇష్టం.. మద్యం తాగడం, మాంసాహారం తినడం, అప్పుడప్పుడు సిగరెట్లు కాల్చడం వంటివి చేస్తూ ఉండేది. ఆమె సంపాదించిన ఆదాయం వాటికే సరిపోయేది. భర్త సంపాదించిందిన దాంతో కష్టంగా ఇంటిని నెట్టుకు వచ్చేది. అయితే ఇది ఆమెకు ఎంత మాత్రం ఇష్టం ఉండేది కాదు.. భర్త ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఆమె తన వ్యవహార శైలి మార్చుకునేది కాదు. పైగా భర్త మీదనే గొడవకు దిగేది.

    ఇదిలా ఉండగా తాను అద్దెకు దిగిన ఇంటి యజమానికి 16 సంవత్సరాల కుమారుడు ఉండేవాడు. అతడు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువుతున్నాడు. అతనిని లొంగదీసుకుంటే .. లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు అని ఆ వివాహిత భావించింది. ఇంకేముంది అతడిని మెల్లిగా ముగ్గులోకి దింపింది. మాయమాటలు చెప్పి, అతడిని లోబరుచుకుంది. భర్త లేని సమయంలో అతనితో శృంగారంలో పాల్గొనేది. ఇలా పీకల్లోతు శృంగారంలో మునిగి తేలేది. దీంతో అతనితో ఏటైనా పారిపోవాలని నిర్ణయించుకుంది. ఆ బాలుడిని కూడా ఒప్పించింది.

    ఇలా ఇంట్లో ఉన్న డబ్బులు, నగలను ఆ బాలుడి ద్వారా తెప్పించింది. అనంతరం భర్త, పిల్లలను వదిలేసి ఈ ఏడాది జనవరి 24న ఆ బాలుడిని తీసుకొని చెన్నై వెళ్లిపోయింది. ఇద్దరూ కనిపించకపోవడంతో అటు బాలుడి తల్లిదండ్రులు, ఇటు ఆ మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ నెంబర్ల ఆధారంగా ట్రేస్ చేద్దామంటే.. వారిద్దరూ ఫోన్ నెంబర్లు మార్చారు. చివరికి ఎలాగోలా వారిద్దరి ఆచూకీ కనిపెట్టి.. తీసుకొచ్చేందుకు వెళ్లారు. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన ఆ వివాహిత.. జూన్ 11న ఆ బాలుడిని సిద్దిపేట బస్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఆ బాలుడు తన ఇంటికి చేరుకున్నాడు.

    ఆ బాలుడి తల్లి అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. పోలీసులు ఆ బాలుడిని విచారించగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.. చెన్నైలో ఒక రూమ్ కిరాయికి తీసుకున్న ఆ వివాహిత.. ఆ బాలుడిని బలవంత పెట్టి శృంగారంలో పాల్గొనేదట. తీసుకెళ్లిన డబ్బులు మొత్తం జల్సాల కోసం ఖర్చు చేసిందట. బంగారాన్ని కూడా ఇతర వ్యక్తులకు అమ్మేసిందట. ఆ నగదు కూడా నిండుకోవడంతో.. ఆ బాలుడిని సిద్దిపేట పోలీస్ స్టేషన్లో వదిలేసిందట. అయితే ఆ బాలుడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఆ వివాహితను అరెస్టు చేసి.. రిమాండ్ కు తరలించారు. ఆమెపై ఫోక్సో కేసు నమోదు చేశారు.