Long Life Animals: ఈ భూమ్మీద ఎక్కువ కాలం జీవించే జంతువులివే..

భూమ్మీద నివసించే క్షీరదాలలో ఏనుగు అతిపెద్దది. ఇది 60 నుంచి 70 సంవత్సరాల వరకు బతుకుతుంది.. జ్ఞానవంతమైన జీవిగా ఇది పేరుపొందింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 16, 2024 5:43 pm

Long Life Animals

Follow us on

Long Life Animals: పుట్టుక, చావు.. ఈ సృష్టిలో ఏ జీవికైనా సర్వసాధారణమే. ఈ జీవుల్లో కొన్ని కొంతకాలం మాత్రమే బతికితే.. మరికొన్ని ఎక్కువ కాలం జీవిస్తాయి. ఇంతకీ ఎక్కువ కాలం జీవించి ఉండే జంతువుల గురించి ఒకసారి పరిశీలిస్తే..

ఏనుగు

భూమ్మీద నివసించే క్షీరదాలలో ఏనుగు అతిపెద్దది. ఇది 60 నుంచి 70 సంవత్సరాల వరకు బతుకుతుంది.. జ్ఞానవంతమైన జీవిగా ఇది పేరుపొందింది.

ఏనుగు

చిలుక

స్పష్టమైన తెలివితేటలకు చిలుకలు పేరుగాంచాయి. ముఖ్యంగా మాకా వంటి జాతికి చెందిన చిలుక 60 సంవత్సరాల పాటు జీవిస్తుంది. చిలకలు అందమైన రూపాలకు ప్రసిద్ధి చెందాయి.

చిలుక

మొసలి

ఉప్పునీటిలో జీవించే మొసళ్లు దృఢమైన శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా నదులు, ఇతర ప్రాంతాలలో జీవించే మొసళ్ళు 70 సంవత్సరాల వరకు బతుకుతాయి.

మొసలి

ఎండ్రకాయలు

ఎండ్రకాయలు అవి జీవితమంతా పెరుగుతూనే ఉంటాయి. వాటి శరీర నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. కొన్ని ఎండ్రకాయలు 100 సంవత్సరాలకు పైగా జీవిస్తాయి..

ఎండ్రకాయలు

తిమింగలం

ఆర్కిటిక్ జలాల్లో నివసించే బోహెడ్ తిమింగలాలు ఈ భూమిపై ఉన్న పురాతన క్షీరదాలుగా ప్రసిద్ధి చెందాయి. వీటి జీవితకాలం 200 సంవత్సరాల వరకు ఉంటుంది.. చల్లటి ఆర్కిటిక్ నీటిలో తన శరీర వేడిని సంరక్షించుకోవడం ద్వారా తిమింగలం ఎక్కువకాలం జీవిస్తుంది. ఈ జీవిలో ప్రత్యేకమైన జీవక్రియ వృద్ధాప్య రేటును తగ్గిస్తుంది.

తిమింగలం

అల్బా ట్రోసెస్

ఆకట్టుకునే రెక్కలతో అల్బా ట్రోసెస్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ జీవి ఎక్కువకాలం సముద్రాల మీద ఎగురుతూ గడుపుతుంది.. 60 సంవత్సరాల వరకు జీవిస్తుంది.

తాబేలు

నెమ్మదిగా జరిగే జీవ క్రియ ద్వారా అద్భుతమైన స్థితి స్థాపక జంతువుగా పేరుపొందింది. తాబేలు 100 లేదా 150 సంవత్సరాల వరకు జీవిస్తుందట.

చేప

చేపల్లో కోయి రకం రెండు వందల సంవత్సరాల పైగా జీవిస్తుంది. ఇది విభిన్న రంగుల్లో కనిపిస్తుంది. తనను తాను కాపాడుకునేందుకు సముద్ర అంతర్భాగంలో జీవిస్తుంది.

చేప

షార్క్

గ్రీన్ ల్యాండ్ ప్రాంతంలో జీవించే షార్క్ లు 400 సంవత్సరాల వరకు జీవిస్తాయి. వీటిని రహస్యజీవులు అని పిలుస్తారు. జంతు రాజ్యంలో అత్యంత ఎక్కువ కాలం జీవించే సకశేరుకాలుగా ఇవి పేరుపొందాయి.

షార్క్

క్లామ్స్

క్లామ్స్(ఒక రకమైన నత్తలు) నిశ్శబ్ద జీవితాన్ని గడుపుతాయి. వందల ఏళ్ల పాటు జీవిస్తాయి.. ఒక అధ్యయనం ప్రకారం 500 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు క్లామ్స్ జీవిస్తాయట.