కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారికి షాకింగ్ న్యూస్..?

భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో ఎక్కువమంది కరోనా బారిన పడటంతో వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. అయితే చాలామంది కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయాందోళనకు గురవుతున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడతామని టెన్షన్ పడుతున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోతే తీసుకోని వారితో పాటు ఇతరులకు కూడా ముప్పేనని వెల్లడిస్తున్నారు. కొత్త […]

Written By: Kusuma Aggunna, Updated On : July 4, 2021 8:09 pm
Follow us on

భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో ఎక్కువమంది కరోనా బారిన పడటంతో వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. అయితే చాలామంది కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయాందోళనకు గురవుతున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడతామని టెన్షన్ పడుతున్నారు.

శాస్త్రవేత్తలు మాత్రం కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోతే తీసుకోని వారితో పాటు ఇతరులకు కూడా ముప్పేనని వెల్లడిస్తున్నారు. కొత్త వేరియంట్లు ఉద్భవించడానికి ఇన్ఫెక్షన్ సోకిన శరీరాలే కారణమవుతాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అమెరికాకు చెందిన ప్రొఫెసర్ విలియం షాఫ్ నర్ వ్యాక్సిన్ తీసుకోని ప్రజలు వేరియంట్లకు ఫ్యాక్టరీలుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వ్యాక్సిన్ తీసుకోని వారి వల్ల వైరస్ మ్యుటేషన్ కు గురవుతుందని పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియంట్ ఇప్పటికే 100 దేశాలకు వ్యాప్తి చెందింది. వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్ వల్ల ప్రపంచం గడ్డు స్థితిలో ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తికి అవకాశమిస్తే వైరస్ మార్పులకు అవకాశం ఇచ్చినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు కొత్తగా వెలుగులోకి వచ్చిన వేరియంట్లపై కూడా ప్రభావవంతంగా పని చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.