సీనియర్ హీరో వెంకటేష్ కుమార్తె ‘ఆశ్రిత’ తాజాగా తన పేరిట అరుదైన రికార్టును సొంతం చేసుకుని మొత్తానికి వెంకీకి పుత్రికోత్సాహాన్ని కలిగించింది. ఇన్ స్టాగ్రామ్‌లో ‘ఆశ్రిత’ రిచ్చేస్ట్ జాబితాలో చోటు దక్కించుకోవడం నిజంగా గొప్ప విషయమే. ఆశ్రిత ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్ఫినిటీ ప్లాటర్ అనే పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేసింది.
తన ఎకౌంట్ లో ఆశ్రిత కుకింగ్ వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఇక ఆశ్రితకు ఇన్ స్టాలో 13 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండటం, వారిలో ఎక్కువమంది ఆమె ఎకౌంట్ అండ్ కంటెంట్ పట్ల ఎక్కువ ఆసక్తిగా ఉండటంతో ఆమె వీడియోలకు ఫుల్ లైక్స్ అండ్ షేర్స్ వస్తున్నాయి. కాగా ఇటీవల హోపర్ డాట్ కం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రెటీల లిస్ట్ రిలీజ్ చేసింది.
అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో ప్రపంచలోనే హాలీవుడ్ నటుడు క్రిస్టియానో రోనాల్డో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. అలాగే ఈ లిస్ట్ లో ఇండియా నుంచి విరాట్ కోహ్లి, నటి ప్రియాంక చొప్రా ఉండటం విశేషం. అలాగే ఈ లిస్ట్ లో హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత కూడా చోటు సంపాదించుకుంది. ఆశ్రిత ప్రపంచవ్యాప్తంగా 377 స్లానంలో నిలవగా.. ఆసియా మొత్తంలో 27వ ర్యాంకులో నిలిచింది.
ఏది ఏమైనా భారతీయులు అత్యల్పంగా ఉన్న ఈ జాబితాలో ఆశ్రిత చోటు దక్కించుకోవడంతో తెలుగు ప్రేక్షకులు, వెంకీ అభిమానులు ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆశ్రిత తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక్కో వీడియో సూమారు 400 డాలర్లు తీసుకుంటుందట. కాగా ఆశ్రిత 2019లో వినాయక రెడ్డిని వివాహం చేసుకుంది.