నేటి నుంచి ఏపీలో కర్ఫ్యూ ఎత్తేసి సడలింపులు?

ఏపీలో కరోనా ఉధృతి చాలా వరకు తగ్గింది. కరోనా కట్టడిని వేసిన లాక్ డౌన్ ఆంక్షలు, కర్ఫ్యూలు, వ్యాక్సినేషన్ తో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ ఈరోజు కోవిడ్ పై సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇందులో తెలంగాణలో లాగానే ఏపీలో సైతం కర్ఫ్యూపై ఫుల్ సడలింపుల దిశగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో విధించిన కర్ఫ్యూ బుధవారంతో ముగుస్తోంది. ప్రభుత్వం 8 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి […]

Written By: NARESH, Updated On : July 5, 2021 8:40 am
Follow us on

ఏపీలో కరోనా ఉధృతి చాలా వరకు తగ్గింది. కరోనా కట్టడిని వేసిన లాక్ డౌన్ ఆంక్షలు, కర్ఫ్యూలు, వ్యాక్సినేషన్ తో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ ఈరోజు కోవిడ్ పై సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇందులో తెలంగాణలో లాగానే ఏపీలో సైతం కర్ఫ్యూపై ఫుల్ సడలింపుల దిశగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.

ప్రస్తుతం ఏపీలో విధించిన కర్ఫ్యూ బుధవారంతో ముగుస్తోంది. ప్రభుత్వం 8 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షల నుంచి సడలింపులు ఇచ్చింది. కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న ఐదు జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకుమ మాత్రమే మినహాయింపును ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే మరోసారి సీఎం జగన్ ఈరోజు కీలక సమీక్ష జరుపబోతున్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, కోవిడ్ నిబంధనలపై సమీక్షించనున్నారు. ఏపీలో తగ్గుముఖం పడుతున్న కేసుల ప్రకారం మొత్తం కర్ఫ్యూ సడలింపులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఏపీలో నిన్న కొత్తగా 3175మందికి పాజిటివ్ గా తేలింది. ఇక నిన్న ఒక్కరోజే 29మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మరణాల సంఖ్య 12844గా ఉంది. మొత్తం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,02,923గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 35325 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 3.3శాతంగానే ఉంది.