కరోనా నుంచి కోలుకున్నా ఆ సమస్య.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..?

దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ వల్ల ఆరోగ్యంగా ఉన్నవాళ్ల జీవితాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ల జీవితాలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుండటం గమనార్హం. ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం పడుతుండటంతో కరోనా నుంచి కోలుకున్న వాళ్లు సైతం అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కనిపిస్తుండటం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో 90 రోజుల పాటు ఊపిరితిత్తుల సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. […]

Written By: Navya, Updated On : May 27, 2021 8:23 am
Follow us on

దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ వల్ల ఆరోగ్యంగా ఉన్నవాళ్ల జీవితాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ల జీవితాలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుండటం గమనార్హం. ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం పడుతుండటంతో కరోనా నుంచి కోలుకున్న వాళ్లు సైతం అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కనిపిస్తుండటం గమనార్హం.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో 90 రోజుల పాటు ఊపిరితిత్తుల సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. కొంతమందిలో మాత్రం ఏకంగా 9 నెలల పాటు ఈ సమస్య కొనసాగే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తులపై పరిశోధనలు చేసిన బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. అత్యాధునిక ఇమేజింగ్ ద్వారా కరోనా నుంచి కోలుకున్న వాళ్ల ఊపిరితిత్తుల పనితీరుపై అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఈ విషయంలో నిర్ధారణకు వచ్చారు.

సీటీ స్కాన్స్ లో ఊపిరితిత్తులు నార్మల్ గానే ఉన్నట్లు అనిపిస్తున్నా ఇమేజింగ్ ద్వారా శాస్త్రవేత్తలు ఊపిరితిత్తులకు కలిగే డ్యామేజ్ ను గుర్తిస్తున్నారు. షెఫీల్డ్ యూనివర్సిటీ వైద్యులు ఎవరైతే ఆస్పత్రిలో చేరకుండా కరోనాకు చికిత్స చేసుకుంటారో వాళ్లలో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడుతున్నాయని చెబుతుండటం గమనార్హం. కరోనా బారిన పడిన వాళ్లు వైరస్ నుంచి కోలుకున్న తరువాత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వాళ్లు ఏ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో ఇతర అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉన్నాయి.