https://oktelugu.com/

కరోనాకు చెక్ పెట్టే మాత్ర.. ఎలా పని చేస్తుందంటే..?

దేశంలో ప్రతిరోజూ వేలసంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. కరోనా సోకిన వాళ్లకు వైద్యులు పారాసెటమాల్, విటమిన్ ట్యాబ్లెట్లను వాడాలని సూచిస్తున్నారు. అయితే మందులు వాడినా ఇన్ఫెక్షన్ తగ్గుతుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా యాంటీ వైరల్ మందులు అందుబాటులోకి వస్తే మాత్రమే భిన్నమైన పరిస్థితులు ఏర్పడతాయి. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ యాంటీ వైరల్‌ మందులపై పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. అన్నీ అనుకున్న విధంగా జరిగితే ఈ ఏడాది చివరినాటికి కరోనాను నయం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 18, 2021 / 12:24 PM IST
    Follow us on

    దేశంలో ప్రతిరోజూ వేలసంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. కరోనా సోకిన వాళ్లకు వైద్యులు పారాసెటమాల్, విటమిన్ ట్యాబ్లెట్లను వాడాలని సూచిస్తున్నారు. అయితే మందులు వాడినా ఇన్ఫెక్షన్ తగ్గుతుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా యాంటీ వైరల్ మందులు అందుబాటులోకి వస్తే మాత్రమే భిన్నమైన పరిస్థితులు ఏర్పడతాయి. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ యాంటీ వైరల్‌ మందులపై పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు.

    అన్నీ అనుకున్న విధంగా జరిగితే ఈ ఏడాది చివరినాటికి కరోనాను నయం చేసే యాంటీ వైరల్‌ మందుబిళ్లలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ద యాంటీవైరల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ పాండెమిక్స్‌ ద్వారా భవిష్యత్తులో మహమ్మారులుగా పరిణమించే వైరస్ లకు చెక్‌పెట్టే కొత్త ఔషధాలను కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇన్‌ఫ్లూయెంజా, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ సి వంటి వైరస్ లకు మందులు అందుబాటులో ఉన్నాయి.

    అయితే కరోనాకు మాత్రం చెక్ పెట్టే మాత్రలు ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ఆస్పత్రిపాలైన వాళ్లకు ఇప్పటికే తయారు చేసిన మందుల వల్ల లాభం లేదని తేలింది. శాస్త్రవేత్తలకు కరోనా సోకిన వాళ్లకు తొలినాళ్లలోనే యాంటీ వైరల్‌ మందులు ఇవ్వాలని అర్థమైంది. అటియా ఫార్మా అభివృద్ధి చేసిన ‘ఏటీ-527 ’ కరోనా సోకిన వాళ్లపై బాగా పని చేస్తుందని సమాచారం.

    రోచె సంస్థ ఈ మందుపై హ్యూమన్‌ ట్రయల్స్‌ చేయడానికి అటియాతో జట్టు కట్టింది. హ్యూమన్ ట్రయల్స్ లో ఈ మందు సక్సెస్ అయితే కరోనా రోగులకు ప్రయోజనం చేకూరుతుంది. వైరస్‌ తనను తాను రెట్టింపు చేసుకోవడాన్ని నిరోధించడంలో ఈ మందు పని చేస్తుందని తెలుస్తోంది.