ఈ క్రైమ్ కామెడీ మూవీలో శ్రీ విష్ణు పాత్ర సరికొత్తగా ఉంది. తన పాత్ర స్వభావంలో వచ్చే హావ భావాలను శ్రీవిష్ణు చాల బాగా పలికించాడు. అలాగే టీజర్ లోని మేకింగ్ షాట్స్, విభిన్నమైన పాత్రలు, ఆ పాత్రల చుట్టూ రొటీన్ కి భిన్నంగా జరిగే డ్రామా మరియు వివేక్ సాగర్ నేపథ్యం ఇలా టీజర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
ఇక ఈ రాజ రాజ చోరని పట్టుకుని, పాత కేసులు సైతం తనపై వేసేయాలన్న కుతూహలంతో తిరిగే పోలీస్ అధికారిగా రవిబాబు కూడా బాగా నవ్వించాడు. ఓవరాల్ గా టీజర్ లో హిలేరియస్ కామెడీకి మంచి స్కోప్ ఉంది. శ్రీవిష్ణుకి ఈ సినిమాతో మరో హిట్ పడటం గ్యారంటీ అనే నమ్మకం కలిగింది. మొత్తమ్మీద ఈ టీజర్, ఈ సినిమా పై ఆసక్తిని రెట్టింపు చేస్తూ అంచనాలను డబుల్ చేసింది.
ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. అన్నట్టు ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రవిబాబు, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. హసిత్ గోళీ దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీనిబట్టి శ్రీవిష్ణుకి ఈ సినిమాతో మరో భారీ హిట్ పడినట్టే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.