Virus in Kerala: కరోనా వైరస్ దేశంలోని ప్రజలను గజగజా వణికించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు పది వేల లోపు ఉండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే కేరళ రాష్ట్రంలో తాజాగా కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చింది. కేరళ రాష్ట్రంలో నోరో వైరస్ కేసులు నమోదవుతున్నాయి.
కేరళలో కొత్త రకం వైరస్ వెలుగులోకి రావడంతో కేరళకు సమీపంలో ఉండే రాష్ట్రాల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేరళలో ఈ వైరస్ బారిన పడిన వాళ్లు 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు కావడం గమనార్హం. ఎర్నాకులం, కొట్టాయం, కన్నూర్ జిల్లాలలో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. నమోదైన ఏడు కేసులలో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని సమాచారం.
Also Read: ముంపు బాధితులను ఆదుకునేందుకు బీజేపీ ముందుకు.. జోలె పట్టిన నేతలు
నోరో వైరస్ పేరుతో పిలుస్తున్న ఈ కొత్తరకం వైరస్ తో బాధ పడేవారిలో వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం లక్షణాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వాళ్లలో గులియన్-బారే సిండ్రోమ్ అనే అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ సమస్యలు కనిపిస్తాయి. ఈ వైరస్ బారిన పడిన వాళ్లలో పాదాలు, కాళ్లలో బలహీనత, జలదరింపు లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
మరోవైపు కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత కొంతమంది బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట్ లాంటి ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ ఆరోగ్య సమస్యల బారిన పడటానికి గల కారణాలను సైతం అధికారులు తెలుసుకునే పనిలో పడ్డారు. కొత్తరకం వైరస్ లు వెలుగులోకి వస్తూ ప్రజలను టెన్షన్ పెడుతుండటం గమనార్హం.
Also Read: దేశంలో తగ్గుతున్న జనాభా.. వెల్లడిస్తున్న గణాంకాలు