https://oktelugu.com/

Hyper Aadi – Raising Raju: హైపర్ ఆది టీమ్ కి అందుకే దూరమయ్యా… రైజింగ్ రాజు కామెంట్స్

Hyper Aadi – Raising Raju: హాస్య ప్రియులు జబర్దస్త్ కామెడీ షో అంటే పడి చస్తారు. ఆ షోలో నటించే టీం లీడర్స్ నుండి కమెడియన్స్ వరకూ అందరి పేర్లు ప్రేక్షకులకు కొట్టిన పిండి. అంతగా ఆ షో, కమెడియన్స్ జనాల మైండ్ లో రిజిస్టర్ అయ్యారు. ఇక జబర్దస్త్ షోలో అన్ని టీమ్స్ ఒకెత్తు, హైపర్ ఆది టీమ్ ఒకెత్తు. ఆది స్కిట్ కోసమే షో మొత్తం చూసే ప్రేక్షకులు ఎందరో. కారణం… హైపర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : November 25, 2021 / 05:26 PM IST
    Follow us on

    Hyper Aadi – Raising Raju: హాస్య ప్రియులు జబర్దస్త్ కామెడీ షో అంటే పడి చస్తారు. ఆ షోలో నటించే టీం లీడర్స్ నుండి కమెడియన్స్ వరకూ అందరి పేర్లు ప్రేక్షకులకు కొట్టిన పిండి. అంతగా ఆ షో, కమెడియన్స్ జనాల మైండ్ లో రిజిస్టర్ అయ్యారు. ఇక జబర్దస్త్ షోలో అన్ని టీమ్స్ ఒకెత్తు, హైపర్ ఆది టీమ్ ఒకెత్తు. ఆది స్కిట్ కోసమే షో మొత్తం చూసే ప్రేక్షకులు ఎందరో. కారణం… హైపర్ ఆది నాన్ స్టాప్ పంచ్ లు కడుపుబ్బా నవ్విస్తాయి. తన టీం లోని రైజింగ్ రాజు, ప్రశాంత్ లపై ఆయన రాసుకునే టైమింగ్ డైలాగ్స్ గిలిగింతలు పెడతాయి. యూట్యూబ్ లో కూడా ఆది స్కిట్స్ ని మిలియన్స్ లో జనాలు చేస్తారు.

    Hyper Aadi – Raising Raju

    Also Read: జబర్దస్త్ కు రాకముందు ఈ కమెడియన్లు ఏం చేసేవారో తెలుసా..?

    కాగా ఆ టీమ్ కి హైపర్ ఆదితో పాటు రైజింగ్ రాజు కూడా లీడర్ గా ఉన్నారు. కొన్నాళ్ళు రైజింగ్ రాజు జబర్దస్త్ లో కనిపించలేదు. దీనితో ఆదితో విబేధాల వలనే రాజు జబర్దస్త్ నుండి తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్స్ కి రాజు క్లారిటీ ఇచ్చాడు. కరోనా సమయంలో నేను షూటింగ్ కి హాజరుకాలేదు. దానికి కారణం.. అప్పుడు మా అమ్మాయికి కూతురు పుట్టింది. షూటింగ్స్ వలన నేను కరోనా బారిన పడితే ఇంట్లో ఉన్న పసికందుతో పాటు తల్లికి కూడా సోకే ప్రమాదం ఉంది. అందుకే నేను షోకి కొన్నాళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చిందని అన్నారు.

    తాను షూటింగ్ లో పాల్గొనకపోయినా హైపర్ ఆది తన పేమెంట్ ప్రతి నెలా ఇంటికి పంపేవాడని రాజు ఎమోషనల్ అయ్యాడు. అలాగే చాలా సార్లు ఆది కష్ట పరిస్థితుల్లో ఆదుకున్నాడు. వయసులో ఆది చిన్నవాడు అయ్యాడు. లేకుంటే అతని కాళ్లకు మొక్కే వాడిని అంటూ రాజు చెప్పుకొచ్చారు. రాజు తిరిగి టీం లోకి రావడంతో మరలా మంచి కామెడీ పండుతుంది. గత కొన్ని వారాలుగా ఆది టీమ్ లో రాజు కనిపిస్తున్నాడు. రాజు, ప్రశాంత్ రూపాలపై ఆది కామెడీ పంచ్ లు విసురుతున్నారు.

    Also Read: విష్ణుపై వ్యాఖ్యల ఫలితం: హైపర్ ఆదిపై దాడి..?నిజమా..?

    Tags