
ప్రపంచ దేశాల్లో ఏ వైరస్ వ్యాప్తి చెందనంత వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ చైనా శాస్త్రవేత్తలు సృష్టేనని నివేదికలు చెబుతున్నాయి. యూరప్ శాస్త్రవేత్తలు చైనా శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో కరోనా వైరస్ ను రూపొందించారని చెబుతున్నారు. సహజంగా కరోనా వైరస్ వచ్చిందని నమ్మించడానికి రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిని పాటించారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
సహజంగా కరోనా వైరస్ వచ్చినట్టు చెప్పే ఆధారాలు లేవని యూరోపియన్ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. చైనా గుహల్లో ఉన్న గబ్బిలాల నుంచి సేకరించిన కరోనా వైరస్ తో తాము ఇప్పటికే పరిశోధనలు జరిపామని ల్యాబ్ లోనే ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరస్ తయారైందని చెప్పడానికి తమ దగ్గర గట్టి ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చైనా శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు సంబంధించిన డాటాను కూడా మాయం చేశారని యూరోపియన్ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
చైనా శాస్త్రవేత్తలు వూహన్ ల్యాబ్‌లోనే వైరస్ తయారైందంటూ వస్తున్న ఆరోపణలకు మౌనం వహిస్తున్నారే తప్ప సమాధానం ఇవ్వడం లేదని 22 పేజీల తమ పరిశోధన పత్రాలు ఇప్పటికే సైంటిఫిక్ జర్నల్స్‌లో ప్రచురితమైనా ఆ పరిశోధన పత్రాల విషయంలో చైనా శాస్త్రవేత్తల నుంచి ఖండన రాలేదని యూరోపియన్ శాస్త్రవేతలు చెబుతున్నారు. కరోనా వైరస్ స్పైక్స్ పాజిటివ్ ఛార్జీతో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సహజ సిద్ధంగా అయితే మూడుకు మించి పాజిటివ్ స్పైక్‌లు ఉండడానికి వీళ్లేదని కరోనాకు మాత్రం నాలుగు స్పైక్ లు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూరోపియన్ శాస్త్రవేత్తలు గట్టి ఆధారాలతో చైనాపై విమర్శలు ఎక్కు పెట్టగా చైనా శాస్త్రవేత్తలు ఆ ఆరోపణల విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.