లీటర్ పెట్రోల్ అక్కడ రూ.50 లోపే.. ఎక్కడో తెలుసా..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరల వల్ల సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. కరోనా వల్ల ఆదాయం అంతకంతకూ తగ్గుతుంటే రికార్డు స్థాయిలొ పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుల పాలిట శాపంగా మారాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల మార్కును అందుకోగా కొన్ని దేశాల్లో మాత్రం పెట్రోల్ ధర చాలా తక్కువగా ఉంది. చమురు నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటైన వెనిజులాలో లీటర్ […]

Written By: Navya, Updated On : May 30, 2021 7:55 pm
Follow us on

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరల వల్ల సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. కరోనా వల్ల ఆదాయం అంతకంతకూ తగ్గుతుంటే రికార్డు స్థాయిలొ పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుల పాలిట శాపంగా మారాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల మార్కును అందుకోగా కొన్ని దేశాల్లో మాత్రం పెట్రోల్ ధర చాలా తక్కువగా ఉంది.

చమురు నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటైన వెనిజులాలో లీటర్ పెట్రోల్ మన దేశ కరెన్సీ ప్రకారం రూపాయి 45 పైసలు కావడం గమనార్హం. ప్రపంచ దేశాలకు పెట్రోల్ ను ఎక్కువగా ఎగుమతి చేసే ఇరాన్ లో లీటర్ పెట్రోల్ ధర 4 రూపాయల 34 పైసలు కావడం గమనార్హం. ఆఫ్రికా దేశమైన సూడాన్ లో లీటర్ పెట్రోల్ ధర 31 రూపాయల 85 పైసలు. చమురు ఉత్పత్తి పైనే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది.

కువైట్ లో లీటర్ పెట్రోల్ ధర 27 రూపాయల 51 పైసలు కాగా ఇక్కడ 94 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉండటం గమనార్హం. అంతర్జాతీయ గ్యాస్, ఆయిల్ మార్కెట్లో కీలక పాత్ర పోషించే దేశం అల్జీరియాలో లీటర్ పెట్రోల్ ధర 24 రూపాయల 61 పైసలుగా ఉంది. ఈక్వెడార్ లో లీటర్ పెట్రోల్ ధర 38 రూపాయలుగా ఉంది. నైజీరియాలో లీటర్ పెట్రోల్ ధర 29.39 రూపాయలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈజిఫ్ట్ లో లీటర్ పెట్రోల్ ధర 39.82 రూపాయలుగా ఉందని తెలుస్తోంది. ప్రపంచంలో సహజవాయువుల ఉత్పత్తి అత్యధికంగా ఉన్న తుర్కమెనిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ధర 30.98 రూపాయలుగా ఉంది. అజెర్‌బైజాన్ లో లీటర్ పెట్రోల్ ధర 42.57 రూపాయలు కావడం గమనార్హం.