China Corona Cases: కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేస్తుందో అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు ఇండియాలో రోజుకు నాలుగు లక్షల వరకు కేసులు వస్తే.. ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. అయితే ఇప్పుడు ఎవ్వరూ ఊహించని దేశాల్లో కరోనా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచం మొత్తం కరోనా తగ్గిపోతే చైనాలో మాత్రం ఓ రేంజ్‌లో కేసులు వస్తున్నాయి.

చైనాలో ఇప్పడు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు మరో దేశం మీద కరోనా దండయాత్ర చేస్తోంది. చైనా తర్వాత ఆ దేశంలోనే కేసులు అధికంగా నమోదవుతున్నాయి. సౌత్ కొరియాలో రోజుకు 4లక్షల వరకు కేసులు నమోదవుతున్నాయి. అక్కడి ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం.. నిన్న కొత్తగా 4 లక్షల 741 కొత్త కేసులు రిజిస్టర్ అయ్యాయి.
Also Read: Nara Lokesh’s Letter To Jagan: జగన్ కు నారా లోకేష్ లేఖ.. కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలట
ఈ దేశంలో గతేడాది జనవరిలో మొదటి కరోనా కేసు వచ్చింది . అప్పటి నుంచి మెల్లి మెల్లిగా కేసులు వస్తుండగా.. ఇప్పుడు మాత్రం ఓ రేంజ్‌లో కేసులు నమోదవుతున్నాయి. ఇక తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 76 లక్షలలకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ వివరించింది.
అయితే గడిచిన ఒక్క మంగళవారం రోజు మాత్రమే 293 మంది చనిపోయారని కూడా తెలిపింది. ఇక అటు చైనాలో కూడా ఒక్కసారిగా కేసులు భారీగా రావడంతో.. లక్షల మంది ఇండ్లకే పరిమితం అయిపోయారు. వేలాది రెసిడెన్స్ లలో లాక్ డౌన్ విధించారు. ఇక బుధవారం రోజు చైనాలో 3,290 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అయితే యాక్టివ్ గా ఉన్న కేసుల్లో 11 కేసులు మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.

చైనాలో మొదటి నుంచి కరోనా కేసుల సంఖ్యను గోప్యంగా ఉంచుతన్న అక్కడి ప్రభుత్వం.. గతేడాది నుంచే అధికారికంగా ప్రకటిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కేసులు తక్కువగా ఉన్న సమయంలో ఈ రెండు దేశాల్లో పెరగడం గమనార్హం.
Also Read: BJP Social Media Controversy: సరికొత్త వివాదం: బీజేపీకి ఫేస్ బుక్ మిత్రపక్షమా?