TRS Dissent: టీఆర్ఎస్ లో అసమ్మతి రగులుతోంది. పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా నేతలకు ఒరిగింది మాత్రం ఏమీ లేదు. దీంతో నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వారు బాహాటంగానే తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అయినా ప్రయోజనం మాత్రం శూన్యమే అని నిట్టూరుస్తున్నారు. కొందరైతే పార్టీ మారడానికి కూడా వెనకాడటం లేదని చెబుతున్నారు. గులాబీ నేతల్లో గుస్సా ఎక్కువవుతోంది.
పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేస్తున్నా ఇంతవరకు ఎలాంటి ప్రయోజనాలు మాత్రం దక్కలేదు. 119 స్థానాలున్న అసెంబ్లీలో 103 స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా ఎమ్మెల్యేలకు ఎలాంటి లాభం లేకుండా పోతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల్లో సహజంగానే ఆగ్రహం పెరుగుతోంది. ఇక లాభం లేదనుకని వేరు కుంపటి పెట్టుకునేందుకు కూడా వెనుకాడటం లేదని చెబుతున్నారు.
Also Read: జగన్ కు నారా లోకేష్ లేఖ.. కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలట
ఈసందర్భంగా పలువురు నేతల్లో తమ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేరే పార్టీలో చేరాలా? లేక పార్టీ పెట్టుకోవాలా అనే దానిపైనే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కొందరైతే పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పోటీ చేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే పార్టీ తీరుపై సహజంగానే దూరంగా జరిగేందుకు చూస్తున్నారు. పార్టీని నమ్ముకున్నా తమకు ఒనగూరే ప్రయోజనం సున్నా అని చెబుతున్నారు.
2014, 2018 ఎన్నికల్లో గెలిచినా ఇప్పటివరకు ఏ రకమైన పదవులు దరిచేరకపోవడంతో నైరాశ్యం పెరుగుతోంది. పార్టీని నమ్ముకుని ఇన్నాళ్లు వేచిచూసినా అదే ధోరణి కొనసాగుతోంది. ఈ క్రమంలో వారిలో రోజురోజుకు భవిష్యత్ పై బెంగ పట్టుకుంటోంది. దీంతో వేరే పార్టీలోకి వెళ్లాలనే ఆలోచనలో పడిపోతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకి కష్టాలు తప్పేలా లేవని చెబుతున్నారు. ఇప్పటికే నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి చాలా మంది నేతలు పార్టీని వీడనున్నట్లు అంచనాలు పెరుగుతున్నాయి. అధికార పార్టీ చిక్కుల్లో పడే అవకాశాలే కనిపిస్తున్నాయి.
Also Read: BJP Social Media Controversy: సరికొత్త వివాదం: బీజేపీకి ఫేస్ బుక్ మిత్రపక్షమా?