https://oktelugu.com/

Pudina: పుదీనా ఔషధాల ఖజానా.. ఎన్నో రోగాలు నయం !

Pudina: పుదీనా గురించి చాలామందికి సరైన అవగాహన లేదు. ఇప్పటికైనా పుదీనా ఔషధాల ఖజానా అని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే.. పుదీనాలో విటమిన్‌ ఎ, సి, ఫోలేట్‌లతో పాటు మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌ లాంటి ఎన్నో సూక్ష్మపోషకాలుంటాయి. పైగా యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ పుదీనా రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది. ‘పుదీనా’ని నిమ్మరసం, పండ్ల రసాలు, మజ్జిగ, ఇలాంటి వాటితో కలిపి తాగితే మెరుగైన ఫలితాలను పొందొచ్చు. ఎందుకో తెలుసా ? పుదీనా ఆకుల్లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 17, 2022 / 11:48 AM IST
    Follow us on

    Pudina: పుదీనా గురించి చాలామందికి సరైన అవగాహన లేదు. ఇప్పటికైనా పుదీనా ఔషధాల ఖజానా అని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే.. పుదీనాలో విటమిన్‌ ఎ, సి, ఫోలేట్‌లతో పాటు మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌ లాంటి ఎన్నో సూక్ష్మపోషకాలుంటాయి. పైగా యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ పుదీనా రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది.

    Pudina

    ‘పుదీనా’ని నిమ్మరసం, పండ్ల రసాలు, మజ్జిగ, ఇలాంటి వాటితో కలిపి తాగితే మెరుగైన ఫలితాలను పొందొచ్చు. ఎందుకో తెలుసా ? పుదీనా ఆకుల్లో ఫినోలిక్‌ సమ్మేళనాలు మెండుగా ఉండటం వల్ల. అవి వివిధ రుగ్మతలను బాగా తగ్గిస్తాయి.

    Also Read: చెరుకు రసం ఓ ఔషధం.. పైగా ఎన్నో ఉపయోగాలు !

    మీకు తెలుసా ? కడుపులో మంట, ఉబ్బరాన్ని కూడా పుదీనా బాగా తగ్గిస్తుంది. పుదీనా ఆకులను తినడం వల్ల లాలా జలగ్రంథులు బాగా చురుగ్గా పనిచేస్తాయి. అప్పుడు జీర్ణప్రక్రియకు కావాల్సిన ఎంజైమ్‌ ల ఉత్పత్తి కూడా చాలా సజావుగా జరుగుతుంది. దాంతో ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.

    ఒకవేళ మీరు ‘పుదీనా’ను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే ఇక మీకు జీవితంలో మలబద్ధకం సమస్య రాదు.

    పైగా పుదీనా తైలం తలనొప్పిని, చికాకుని కూడా బాగా తగ్గిస్తుంది. అందుకే, పుదీనా నూనె, ఆకుల సువాసనను ఎక్కువగా ఆస్వాదించండి. అలా చేస్తే.. మీకు అలసట, ఆందోళన, ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతాయి. అన్నిటికీ మించి పుదీనా మన మెదడును బాగా ఉత్తేజంగా ఉంచుతుంది. అలాగే దగ్గు, గొంతు నొప్పులతో బాధపడేవారు కప్పు పుదీనా టీ తీసుకున్నా చాలు, వెంటనే ఉపశమనం లభిస్తుంది.

    ఇక గర్భిణుల్లో సాధారణంగా కనిపించే మార్నింగ్‌ సిక్‌ నెస్‌ ను పుదీనా బాగా తగ్గిస్తుంది. మజ్జిగలో పుదీనా ఆకులను వేసుకుని తాగితే.. వికారం, వాంతుల నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

    Also Read: భోజనం చేసిన తర్వాత ఈ తప్పులు చేస్తున్నారా.. ప్రాణాలకే ప్రమాదమట!

    Tags