Omicron Lockdown: ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం విస్తరిస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో త్వరలో నిర్వహించే క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలు జరుపుకోవడంతో వైరస్ తీవ్రత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పండుగుల నిర్వహణతో వేరియంట్ ప్రభావం మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే దానిపైనే దృష్టి సారిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ విధించేందుకు సిద్ధమవుతున్నట్లు వాదనలు వస్తున్నాయి. దీంతో ఒమిక్రాన్ బారి నుంచి రక్షించుకునే క్రమంలో ప్రభుత్వాలు ఆంక్షలు విధించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. నెదర్లాండ్ దేశంలో ఆదివారం నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మరోమారు లాక్ డౌన్ తెరమీదికి రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంటోంది.
Also Read: పిల్లలపై మామూలుగా లేదుగా?
ఈ పరిస్థితుల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. క్రిస్మస్ వేడుకల్లో 13 సంవత్సరాల పైనున్న 60 సంవత్సరాల లోపు వారినే పాల్గొనాలని సూచిస్తున్నారు. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తగ్గించేందుకు పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఐరోపా దేశాల్లో ఆంక్షల పర్వం మొదలైంది. దీంతో మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
మార్కెట్లు, రెస్టారెంట్లు, పార్కులు, సినిమా హాల్లు తదితర వాటిల్లో మళ్లీ కఠినంగా ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోమారు పాఠశాలల మూసివేతకు కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం వ్యాపించకుండా చూసేందుకు ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది.
Also Read: పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే ఈ పానీయాలు తాగాల్సిందే!