https://oktelugu.com/

వెలుగులోకి మరో రకం కరోనా.. వేగంగా వ్యాప్తి చెందే ఛాన్స్..?

గత కొన్నిరోజులుగా కరోనా వైరస్ కొత్త కేసులు అంతకంతకూ తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే కేసులు తగ్గుతున్నా వెలుగులోకి వస్తున్న కొత్త వేరియంట్లు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ లో లాంబ్డా అనే వేరియంట్ కలకలం సృష్టిస్తుండటం గమనార్హం. ఇతర దేశాల్లో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్ ను దృష్టిసారించాల్సిన వైరస్ రకంగా పేర్కొంది. బ్రిటన్ కు చెందిన పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 28, 2021 / 08:04 AM IST
    Follow us on

    గత కొన్నిరోజులుగా కరోనా వైరస్ కొత్త కేసులు అంతకంతకూ తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే కేసులు తగ్గుతున్నా వెలుగులోకి వస్తున్న కొత్త వేరియంట్లు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ లో లాంబ్డా అనే వేరియంట్ కలకలం సృష్టిస్తుండటం గమనార్హం. ఇతర దేశాల్లో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్ ను దృష్టిసారించాల్సిన వైరస్ రకంగా పేర్కొంది.

    బ్రిటన్ కు చెందిన పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ సైతం ఈ వేరియంట్ ను పరిశోధనలో ఉన్న కరోనా రకంగా వర్ణించటం గమనార్హం. ఈ కరోనా వేరియంట్ స్పైక్ ప్రోటీన్ లో ఎల్ 452 క్యూ, ఎఫ్ 490ఎస్ తో పాటు పలు ఉత్పరివర్తనలు ఉండటంతో పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ ఈ వేరియంట్ ను పరిశోధనలో ఉన్న కరోనా రకంగా వర్గీకరించటం గమనార్హం. 2020 సంవత్సరం ఆగష్టులో పెరూలో ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చింది.

    ఆ తరువాత 29 దేశాలకు ఈ వేరియంట్ విస్తరించింది. అయితే లాంబ్డా వేరియంట్ వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పడానికి కానీ, ప్రస్తుత వ్యాక్సిన్లను ఇది ఏమార్చే అవకాశం ఉందని కానీ చెప్పడానికి అవకాశం లేదు. అయితే స్పైక్ ప్రోటీన్ లోని కొన్ని ఉత్పరివర్తనల వల్ల ఇది వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ దీని గురించి మెరుగ్గా తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు చేయనున్నట్టు వెల్లడించింది.

    కరోనా కేసులు తగ్గినప్పటికీ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.