
కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యి లక్షణాలు కనిపించని వాళ్లకు నిపుణులు షాకింగ్ న్యూస్ చెప్పారు. కరోనా సోకినా ఏం కాదులే అని ధీమాగా ఉండటం సరికాదని నిపుణులు వెల్లడిస్తున్నారు. కోలుకున్న తర్వాత కూడా కనీసం రెండు,మూడు నెలల పాటు ఆరోగ్యపరమైన జాగ్రత్త చర్యలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండటం గమనార్హం.
కరోనా సోకి లక్షణాలు కనిపించని వాళ్లను . నరాలు, కండరాల నొప్పులు, శ్వాస సమస్యలు, హై కొలెస్టరాల్, నీరసం, హైబీపీ, మైగ్రెయిన్లు, జీర్ణాశయ రుగ్మతలు, చర్మ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఫెయిర్ హెల్త్ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనం ద్వారా ఈ విషయాలు వెల్లడి కావడం గమనార్హం.
గత సంవత్సరం ఇన్ఫెక్షన్ బారినపడిన దాదాపు 20 లక్షల మంది ఆరోగ్యబీమా నివేదికలను విశ్లేషించి వైద్య నిపుణులు ఈ విషయాలను వెల్లడించారు. 20 లక్షల మందిలో 4.54 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్న నెల, నెలన్నర రోజుల తర్వాత వివిధ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరారని వైద్య నిపుణులు చెబుతున్నారు. లక్షణాలు కనిపించని వాళ్లలో 5 శాతం మంది దీర్ఘకాల కొవిడ్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.
కరోనా ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రుల్లో చేరిన వారిలో 594 మంది కోలుకున్న నెల, నెలన్నర తరువాత వివిధ ఆరోగ్య సమస్యలతో మృతిచెందారని వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఆరోగ్య బీమా సంస్థల వద్ద నమోదైన ఆయా వ్యక్తుల ఆరోగ్య వివరాల విశ్లేషణ ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది.