ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు
తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు పెంచినట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. జూన్ 24 వరకు గడువు పెంచూతు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కోసం 2 లక్షల 25 వేల 125 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. అగ్రికల్చర్ బీఎస్సీ కోసం 75,519 మంది దరఖాస్తు చేసుకున్నారని గోవర్ధన్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఓసారి పెంచారు. తాజాగా మరోసారి గడువు పెంచడంతో మరింత మంది విద్యార్థులు దరఖాస్తు చేసే […]
Written By:
, Updated On : June 17, 2021 / 05:12 PM IST

తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు పెంచినట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. జూన్ 24 వరకు గడువు పెంచూతు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కోసం 2 లక్షల 25 వేల 125 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. అగ్రికల్చర్ బీఎస్సీ కోసం 75,519 మంది దరఖాస్తు చేసుకున్నారని గోవర్ధన్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఓసారి పెంచారు. తాజాగా మరోసారి గడువు పెంచడంతో మరింత మంది విద్యార్థులు దరఖాస్తు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.