
కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేయడంతో పాటు నీరసంగా మారుస్తోంది. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా కరోనా నుంచి త్వరగా కోలుకోవడంతో పాటు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కరోనా రోగులు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలకు సంబంధించి జాబితాను విడుదల చేసింది. కరోనా సోకిన వాళ్లు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
ఐదు రకాలు పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. 70 శాతం కొకొవా ఉన్న డార్క్ చాక్లెట్లు తక్కువ మోతాదులో తీసుకుంటే కరోనా కారణంగా వచ్చే ఆందోళనకు అదుపులో పెట్టడం సాధ్యమవుతుంది. రోజులో ఒకసారి పసుపు కలిపిన పాలు తాగినా ఇమ్యూనిటీ పవర్ ను సులభంగా పెంచుకోవడం సాధ్యమవుతుంది. కరోనా రోగులు వాసన గుణాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.
తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినే ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పవచ్చు. రాగి, ఓట్స్‌లాంటి తృణ ధాన్యాలను తీసుకునే ప్రయత్నం చేసినా మంచిదని చెప్పవచ్చు. ప్రోటీన్ ఎక్కువగా లభించే చికెన్, ఫిష్, గుడ్లు, పనీర్, సోయా, కాయగింజలు, వాల్‌నట్స్, ఆలివ్ ఆయిల్, బాదాం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటే మంచిది. వీలైనంత వరకు ఇంటినుంచి బయటకు రాకుండా ఉంటే వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.