కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలామందిని అలసట, నీరసం లాంటి సమస్యలు వేధిస్తున్నాయి. కరోనాను జయించిన మహిళల్లో కొంతమంది జుట్టు రాలడం సమస్యతో బాధ పడుతున్నారు. కరోనా వల్ల కలిగే భయాలు, ఒత్తిడి ఈ సమస్యకు కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా జుట్టు రాలే సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. రోజూ ఏడు బాదం పప్పులు, రెండు వాల్ నట్స్ తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యను సులభంగా అధిగమించవచ్చు. టీస్పూన్ సబ్జా గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు జుట్టు రాలే సమస్యను దూరం చేయడంలో సహాయపడతాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి ఒత్తుగా పెరిగేందుకు ప్రోటీన్ సహాయపడుతుంది.
రోజూ మూడు కోడిగుడ్ల తెల్లసొనలు, ఒక పచ్చసొన తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. శరీరంలో బీ12 విటమిన్ లోపం ఉన్నా సులభంగా కొత్త జుట్టు పెరిగే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు. విటమిన్ డి లోపం ఉన్నవాళ్లలో జుట్టు ప్యాచుల్లా రాలిపోవడం జరుగుతుంది. విటమిన్ సప్లిమెంట్స్ ను వైద్యుల సలహాలతో తీసుకుంటే మంచిది.
ఇష్టం వచ్చినట్లుగా దువ్వడం, బ్లో డ్రయర్స్ వాడడం కాస్త వేడిగా ఉండే నూనెతో మసాజ్ చేయడం వల్ల జుట్టు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ధ్యానం, యోగా, శ్వాస సంబంధిత వ్యాయమాలు చేయడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకుంటే జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆకుకూరలు, మాంసం, చేపలు తినడంతో పాటు వాటిలోని పోషకాల ద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.