
కరోనా సోకిన వాళ్లలో ఎక్కువమంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడుతున్నారు. ఇతర వైరస్ లకు భిన్నంగా కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపైనే దాడి చేస్తుండటం గమనార్హం. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా లంగ్స్ దెబ్బ తినకుండా జాగ్రత్త పడవచ్చు. కరోనా సెకండ్ వేవ్ లో చాలామంది ఊపిరి సంబంధిత సమస్యలతోనే ప్రాణాలను కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఊపిరితిత్తులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వాటి ఆరోగ్యం గురించి సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
కొన్ని హెల్త్ డ్రింక్స్ తాగడం వల్ల ఆస్పత్రులకు వెళ్లి పెద్దగా ఖర్చు చేయకుండానే ఊపిరితిత్తులు బలపడేలా చేసుకునే అవకాశం ఉంటుంది. ఓ కప్పు నీటిలో 2 యాలకులు, ఓ చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి 10 నిమిషాలు వేడి చేసి తాగితే ఊపిరితిత్తులకు మేలు జరగడంతో పాటు హైబీపీ, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. వేడిపాలలో కొద్దిగా పసుపు వేసుకొని తాగితే జలుబు, దగ్గు సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.
నీటిలో పుదీనా ఆకులను వేసి ఉడకబెట్టి ఆ నీటిని తాగితే గొంతులో మంట, గరగర వంటి సమస్యలు తగ్గుతాయి. ఊపిరితిత్తులకు వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్లను పుదీనా ఆకులు అడ్డుకుంటాయి. తేనెలో ఎన్నో పోషకాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. శరీరంలోని వేడితో పాటు చెడు వ్యర్థాలను తొలగించడంలో పుదీనా ఆకులు తోడ్పడతాయి. గోరు వెచ్చటి నీటిలో ఓ స్పూన్ తేనె వేసుకొని తాగితే ఊపిరితిత్తులకు మంచిది.
రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల కూడా ఊపిరితిత్తులకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు. గ్రీన్ టీ ద్వారా శరీరానికి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అందే అవకాశం అయితే ఉంటుంది.