కరోనా బాధితులకు శుభవార్త.. ఈ ఔషధంతో వైరస్ కు చెక్..?

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో సెకండ్ వేవ్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2 – డీజీ అనే ఔషధం కరోనా సోకిన వాళ్లు వేగంగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని తేలింది. త్వరలో ఈ ఔషధం మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. ఈ ఔషధాన్ని వినియోగించడం వల్ల కరోనా బాధితులకు ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరం కూడా […]

Written By: Navya, Updated On : May 9, 2021 11:11 am
Follow us on

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో సెకండ్ వేవ్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2 – డీజీ అనే ఔషధం కరోనా సోకిన వాళ్లు వేగంగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని తేలింది. త్వరలో ఈ ఔషధం మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది.

ఈ ఔషధాన్ని వినియోగించడం వల్ల కరోనా బాధితులకు ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరం కూడా తగ్గనుందని తెలుస్తోంది. డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీజీసీఐ) ఇప్పటికే ఈ ఔషధానికి అనుమతులు లభించాయి. అత్యవసర వినియోగానికి ఈ ఔషధం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. డీఆర్‌డీవో అనుబంధ సంస్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అల్లైడ్‌ సైన్సెస్‌ ఈ ఔషధాన్ని తయారు చేయడం గమనార్హం.

ఎవరైతే ఈ ఔషధాన్ని వాడారో వారిలో కేవలం నాలుగు నుంచి ఐదు నెలల్లోనే కరోనా నెగిటివ్ వచ్చిందని తెలుస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్న తరుణంలో 2 – డీజీ అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. కరోనా వైరస్‌ పెరుగుదలను సమర్థవంతంగా ఈ ఔషధం అడ్డుకుంటుంది. సాధారణంగా కోలుకునే రోగులతో పోలిస్తే ఈ ఔషధం తీసుకున్న రోగులు మూడురోజుల ముందుగానే కోలుకున్నట్టు తెలుస్తోంది.

పొడి రూపంలో లభించే ఈ ఔషధాన్ని నీటిలో కరిగించుకుని తాగాల్సి ఉంటుంది. కణాల నుంచి వైరస్‌లు శక్తి పొందకుండా నిరోధించడంలో ఈ ఔషధం తోడ్పడుతుంది. ఈ ఔషధం సాధారణ గ్లూకోజ్ అణువులను పోలి ఉండటం గమనార్హం. అతి త్వరలోనే ఈ ఔషధం మార్కెట్ లోకి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.