https://oktelugu.com/

కేజీ ప్లాస్టిక్ ఇస్తే నచ్చింది తినే ఛాన్స్.. ఎక్కడంటే..?

ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికించిన సంగతి తెలిసిందే. వైరస్ విజృంభణ వల్ల ప్రజలకు ఆర్థిక నష్టంతో పాటు ప్రాణ నష్టం జరుగుతోంది. అయితే కరోనా లాంటి వైరస్ ల పుట్టుకకు పరోక్షంగా మనమే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని.. ప్లాస్టిక్ వస్తువుల వాడకం పెరగడం వల్ల ప్రకృతి ప్రమాదంలో పడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. Also Read: చినిగిపోయిన రూ.2000, రూ.500 నోట్లు ఉన్నాయా.. ఎలా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 3, 2021 / 05:59 PM IST
    Follow us on

    ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికించిన సంగతి తెలిసిందే. వైరస్ విజృంభణ వల్ల ప్రజలకు ఆర్థిక నష్టంతో పాటు ప్రాణ నష్టం జరుగుతోంది. అయితే కరోనా లాంటి వైరస్ ల పుట్టుకకు పరోక్షంగా మనమే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని.. ప్లాస్టిక్ వస్తువుల వాడకం పెరగడం వల్ల ప్రకృతి ప్రమాదంలో పడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

    Also Read: చినిగిపోయిన రూ.2000, రూ.500 నోట్లు ఉన్నాయా.. ఎలా మార్చుకోవాలంటే..?

    పర్యావరణవేత్తలు ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు వీలైనంత తగ్గిస్తే మంచిదని సూచిస్తున్నారు. సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ప్లాస్టిక్‌ లావో ఖానా ఖిలావో అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఢిల్లీలోని నజాఫ్‌గర్‌ జోన్‌ లో మొదటి గార్బేజ్‌ కేఫ్ ప్రారంభం కాగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ కొత్తగా 23 గార్బేజ్ కేఫ్ లను అందుబాటులోకి తెచ్చింది. గార్బేజ్ కేఫ్స్ కు ఎవరైనా కేజీ ప్లాస్టిక్ ను ఇచ్చి ఇష్టమైన భోజనం ఆర్డర్ చేసి తినవచ్చు.

    Also Read: నీళ్లు అనుకుని శానిటైజర్ తాగిన కమిషనర్.. చివరకు..?

    ఎంతోమంది తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతూ ఉండటంతో అలాంటి వాళ్లు కేజీ ప్లాస్టిక్ ఇస్తే నచ్చిన భోజనాన్ని తినవచ్చని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. కొన్ని రెస్టారెంట్ లతో ఒప్పందాలు కుదుర్చుకున్న మున్సిపల్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకున్న రెస్టారెంట్లలో ప్లాస్టిక్ ఇచ్చి కూపన్లు తీసుకున్న వాళ్లు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చని చెబుతుండటం గమనార్హం. కేజీ ప్లాస్టిక్ ఇచ్చిన వాళ్లు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ లను తీసుకుని నచ్చిన ఆహారం తినవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: జనరల్

    ఎవరైనా ప్లాస్టిక్ ఇచ్చి ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడకపోతే వారికి మున్సిపల్ కార్పొరేషన్ అరకేజీ స్వీట్స్‌ ఇవ్వనుంది. మేయర్‌ అనామిక సౌత్‌జోన్, సెంట్ర జోన్, వెస్ట్‌ జోన్ లలో గార్బేజ్‌ కేఫ్ లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇలా సేకరించిన ప్లాస్టిక్ తో దేశంలోని పలు ప్రాంతాల్లో అధికారులు రోడ్లు వేస్తున్నారని సమాచారం.