బాలయ్య అఘోరా గెటప్ లో మార్పులు !

బాలయ్య – బోయపాటి సినిమాలో బాలయ్య బాబు డబుల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు చిన్నతనంలోనే విడిపోగా వారిలో ఒకరు అఘోరాగా మారతాడట. అయితే, బాలయ్య అఘోరాగా కనిపిస్తే జనం చూస్తారా అనేది డౌటే. ఎందుకంటే అఘోరా అంటే ఒంటి నిండి బూడద పూసుకుని, గోచీలు పెట్టుకుని జడలు పెరిగిన జుట్టుతో కనిపించాలి. ఆ గెటప్ లో బాలయ్యను అస్సలు ఊహించుకోలేము. అందుకే ఈ గెటప్ ను తీసేసి బాలయ్యను కేవలం పంచె, లాల్చీలో చూపిస్తున్నారు. […]

Written By: admin, Updated On : February 3, 2021 5:45 pm
Follow us on


బాలయ్య – బోయపాటి సినిమాలో బాలయ్య బాబు డబుల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు చిన్నతనంలోనే విడిపోగా వారిలో ఒకరు అఘోరాగా మారతాడట. అయితే, బాలయ్య అఘోరాగా కనిపిస్తే జనం చూస్తారా అనేది డౌటే. ఎందుకంటే అఘోరా అంటే ఒంటి నిండి బూడద పూసుకుని, గోచీలు పెట్టుకుని జడలు పెరిగిన జుట్టుతో కనిపించాలి. ఆ గెటప్ లో బాలయ్యను అస్సలు ఊహించుకోలేము. అందుకే ఈ గెటప్ ను తీసేసి బాలయ్యను కేవలం పంచె, లాల్చీలో చూపిస్తున్నారు.

Also Read: డిజిటల్ & శాటిలైట్ రైట్స్ లో మహేష్ సరికొత్త రికార్డ్ !

కాగా వచ్చే షెడ్యూల్ లో అఘోర పాత్రకు సంబధించిన సీక్వెన్స్ లు తీయనున్నారు. కథకు చాలా కీలకమైనవి కావడంతో ఎట్టి పరిస్థితుల్లో వారణాసి మరియు హిమాలయాలలో విస్తృతంగా షూట్ చేయనున్నారు. ఎలాగూ స్టూడియోల్లో సెట్ వేయడం సాధ్యం అయ్యే పని కాదు కాబట్టి.. బాలయ్య టీమ్ వారణాసికి పయనం కానుంది. ఇక స్క్రిప్ట్ లో అఘోర పాత్రకు సంబధించిన సీక్వెన్స్ లు చాల బాగుంటాయట, బాలయ్యకి ఆ సీక్వెన్స్ బాగా నచ్చిందని.. అందుకే బోయపాటి ఈ సీక్వెన్స్ కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుని షూట్ చేయబోతున్నారట.

Also Read: మరో క్రేజీ మల్టీస్టారర్ కి రంగం సిద్ధం !

ఇక ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్, మొదటిసారి బాలయ్య సినిమాకి మ్యూజిక్ ఇస్తుండటంతో మ్యూజిక్ పై సహజంగానే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంటుంది. ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించాడు, కాకపోతే ఈ సారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలంటే బోయపాటి రోటన్ యాక్షన్ కొట్టుడుకు దూరంగా ఉండాలి. ఏదైనా కొత్తగా చేయాలి. ఇదే విషయాన్ని బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బోయపాటికి తెగ రిక్వెస్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మరి బాలయ్యకు బోయపాటి హిట్ ఇస్తాడో.. లేక చేతులు ఏతేస్తాడో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్